SEBI on Adani: అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ! సుప్రీం కోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్‌

SEBI-on-Adani-supreme court - Sakshi

SEBI on Adani: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణ కోరిన కొంతమంది పిటిషనర్లు ఆరోపించినట్లు తాము 2016 నుంచి ఏ అదానీ గ్రూప్ కంపెనీలపై విచారణ చేయలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

ఇదీ చదవండి: Raghav Chadha Net Worth: పరిణీతి చోప్రా ఫియాన్సీ ఆస్తి ఇంతేనా? ఇల్లు, కారు గురించి ఆసక్తికర విషయాలు

ఈ మేరకు రిజాయిండర్ అఫిడవిట్‌ను సమర్పించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న విషయాల్లో ఎటువంటి పొంతన లేదని ఈ అఫిడవిట్‌లో సెబీ పేర్కొంది. అదానీ గ్రూప్‌ కంపెనీలపై సెబీ విచారణ జరిపినట్లుగా పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.  అయితే తాము విచారణ జరిపిన 51 భారతీయ లిస్టెడ్ కంపెనీలు గ్లోబల్ డిపాజిటరీ రసీదుల జారీకి సంబంధించినవని సెబీ వివరణ ఇచ్చింది. వీటిలో అదానీ గ్రూప్‌నకు చెందిన ఏ లిస్టెడ్ కంపెనీ లేదని స్పష్టం చేసింది.

‘పూర్తిగా అవాస్తవం’
తాము చేపట్టిన విచారణ అనంతరం సంబంధిత కంపెనీలపై తగిన చర్యలు తీసుకున్నామని సెబీ అఫిడవిట్‌లో పేర్కొంది. అందువల్ల 2016 నుంచే అదానీ గ్రూప్‌ను తాము విచారిస్తున్నట్లు చేసిన ఆరోపణ పూర్తిగా నిరాధారమైనదని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో వచ్చిన ఆరోపణలపై విచారణను పూర్తి చేసేందుకు సెబీ సుప్రీం కోర్టు మరో ఆరు నెలల సమయం కోరింది.  దీన్ని వ్యతిరేకిస్తూ 2016 నుంచే అదానీ గ్రూప్‌పై సెబీ విచారణ జరుపుతోందని పిటిషనర్‌ ఒకరు ఆరోపించారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top