ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు!  

Infosys allots Rs 64 crore worth of shares to employees - Sakshi

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది.  ఈ మేరకు 5,11,862 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు మే 12న  తెలియజేసింది.

ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!

షేర్ల విలువ రూ.64 కోట్లు
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. 5,11,862 షేర్ల విలువ దాదాపు రూ.64 కోట్లు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద 1,04,335 ఈక్విటీ షేర్లు, ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ 2019 కింద 4,07,527 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు  కంపెనీ తెలిపింది. ఈ కేటాయింపు తర్వాత కంపెనీ విస్తరించిన షేర్ క్యాపిటల్ రూ.2,074.9 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రాం 2019 కింద పొందిన షేర్లకు సంబంధించి ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు.

ఉద్యోగులను ప్రోత్సహించేందుకే..
ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ 2019 ఉద్దేశం ఈ పనితీరు ఆధారిత స్టాక్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా కీలక ప్రతిభను ప్రోత్సహించడం, నిలుపుకోవడం,  ఆకర్షించడం. అలాగే కంపెనీలో ఉద్యోగుల యాజమాన్యాన్ని విస్తరించడం. ఇన్ఫోసిస్‌  ఉద్యోగులందరూ ప్లాన్‌లో పాల్గొనడానికి అర్హులు. ఈ ప్లాన్ కింద నిరోధిత స్టాక్ యూనిట్ల మంజూరు కోసం ఉద్యోగుల అర్హతను వారి స్థాయి, పనితీరు, ఇతర ప్రమాణాల ఆధారంగా కంపెనీ నిర్ణయిస్తుంది.

ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ 2019 కింద ఇవ్వబడిన నిరోధిత స్టాక్ యూనిట్ వెస్టింగ్ వ్యవధి అవార్డు తేదీ నుంచి కనిష్టంగా సంవత్సరం, గరిష్టంగా మూడేళ్ల వరకు ఉంటుంది. ఉద్యోగిని తొలగించినప్పుడు లేదా రాజీనామా చేసిన సందర్భంలో వెస్టింగ్ ప్రమాణాలు సంతృప్తి చెందకపోతే సంబంధిత అవార్డు ఒప్పందం కింద మంజూరు చేసిన నియంత్రిత స్టాక్ యూనిట్లు రద్దు అవుతాయని కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top