ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!

Female influencer creates AI powered virtual girlfriend that could earn Rs 41 crore per month - Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అచ్చం తన లాంటి వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌ ను సృష్టించి నెలకు రూ. 41 కోట్ల వరకు సంపాదిస్తోంది ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్. స్నాప్‌చాట్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖ ఇన్‌ఫ్లుయన్సర్ కారిన్ మార్జోరీ.. ఫరెవర్ వాయిసెస్‌ అనే సంస్థ సహాయంతో కారిన్ ఏఐ (CarynAI) పేరుతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెర్షన్‌ను రూపొందించింది.

ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు

కారిన్ ఏఐ వాయిస్ ఆధారిత చాట్‌బాట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చం మార్జోరీ లాంటి వాయిస్, వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కస్టమర్లతో సన్నిహితంగా మాట్లాడుతుంది. వారి భావాలను పంచుకుంటుంది. మార్జోరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఏఐ వర్షన్  ఒంటరితనాన్ని నయం చేయగలదని, నెలకు 5 మిలియన్ డాలర్ల (రూ. 41 కోట్లు) వరకు సంపాదించగలదని చెప్పారు.

టెస్టింగ్ లో భాగంగా టెలిగ్రామ్ యాప్‌లో మే నెలలో కారిన్ ఏఐని ప్రారంభించగా మార్జోరీ భాగస్వాముల నుంచి  71,610 డాలర్ల  ఆదాయాన్ని ఆర్జించింది. కారిన్ ఏఐ ఇప్పటికే దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే ఇది నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. 2013లో విడుదలైన హర్‌ అనే  చిత్రాన్ని గుర్తుకుతెస్తోంది. కారిన్ ఏఐని సృష్టించడానికి యూట్యూబ్ లో సుమారు 2 వేల గంటల పాటు ఉన్న మార్జోరీ ప్రసంగాలను, హావభావాలను ఫరెవర్ వాయిసెస్‌ సంస్థ వినియోగించింది. ఈ ఇదివరకే సృష్టించిన స్టీవ్ జాబ్స్, టేలర్ స్విఫ్ట్, డొనాల్డ్ ట్రంప్ చాట్‌బాట్ వెర్షన్‌ల మాదిరిగా కాకుండా కారిన్ ఏఐ దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరుస్తుంది.

ప్రతిరోజూ 250కి పైగా కంటెంట్‌లను స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేసే మార్జోరీ..  తనకు, తన ప్రేక్షకులకు మధ్య ఉన్న అంతరాన్ని కారిన్ ఏఐ తొలగిస్తోందని చెబుతోంది. కారిన్ ఏఐ ఒంటరితనాన్ని దూరం చేయగలదాని, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక మంచి మార్గంగా నిలిచిందని పేర్కొంది. కారిన్ ఏఐ గురించి మార్జోరీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. తన స్నాప్‌చాట్‌ ఫాలోవర్లలో కనీసం 20 వేల  మంది కారిన్ ఏఐకి సబ్‌స్క్రైబర్‌లుగా మారతారని, దీని వల్ల నెలకు 5 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top