ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు

china arrests man for spreading fake news using chatgpt - Sakshi

సాంకేతిక ప్రపంచంలో సంచలనం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని వివిధ రకాలుగా, వివిధ పనుల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఆకతాయి పని చేసి అరెస్ట్ అయి కటకటాలపాలయ్యాడో వ్యక్తి. 

ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీని ఉపయోగించి ఫేక్ వార్తలను రాసినందుకు చైనాలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. రైలు ప్రమాదం జరిగి 9 మంది మృతి చెందారని ఫేక్ వార్తా కథనాన్ని పోస్ట్ చేశాడు నిందితుడు. ఈ కథనం బైజియావో అనే బ్లాగ్ కు సంబందించిన ఖాతాలలో ప్రచురితమైంది. 15 వేల మంది ఈ తప్పుడు వార్తను చూశారు. క్లిక్‌బైట్ ద్వారా డబ్బు సంపాదించేందుకే  తప్పుడు కథనాలను పోస్ట్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేయడం చైనాలో మొదటిసారిగా జరిగింది. 

ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు!
హాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఓ వ్యక్తి తప్పుడు సమాచారాన్ని రూపొందించడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకున్నాడని దానిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసాడని ఉత్తర గన్సు ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో WeChatలో పోస్ట్ చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిందితుడు చేసిన ఆకతాయి పనికి అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సంఘటన చాట్ జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని మరోసారి తెలియజేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top