Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు!

Paytm Payments Bank rolls out new features - Sakshi

ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం (Paytm) సరి కొత్త ఫీచర్లను  తీసుకొచ్చింది.  యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన iOSలో యూపీఐ లైట్ ఫీచర్, యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ యాడింగ్, స్ప్లిట్ బిల్, మొబైల్ నంబర్‌లకు బదులుగా పేటీఎం యాప్‌లో ప్రత్యామ్నాయ యూపీఐ ఐడీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ (PPBL) నిర్వహించిన సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్‌లో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో, పేటీఎం  పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ, బోర్డు సభ్యుడు భవేష్ గుప్తా, PPBL  సీఈవో సురిందర్ చావ్లా కంపెనీ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను ప్రకటించారు.

పేటీఎం కొత్త ఫీచర్లు ఇవే.. 
పేటీఎం యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌ను పేటీఎం యాప్‌లో యూపీఐ ఐడీతో లింక్ చేసుకోవచ్చు. అన్నింటి ముఖ్యమైన విప్లవాత్మక ఫీచర్.. స్ప్లిట్ బిల్. అంటే ఏదైనా బిల్లును స్నేహితుల సమూహంలో విభజించి పంచుకోవచ్చు. అలాగే పేటీఎంలో చేసిన అన్ని చెల్లింపులను ట్యాగ్ చేయవచ్చు. అదేవిధంగా ట్యాగ్‌ చేసిన చెల్లింపులను ఎప్పుడైనా చూసుకోవచ్చు. 

ఇక ఫిబ్రవరిలో ప్రారంభించిన సంచలనాత్మక యూపీఐ లైట్ ఫీచర్ తాజాగా యాపిల్ ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి  వచ్చింది. చెల్లింపులను క్రమబద్ధీకరించడం, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యను తొలగించడం దీని ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా ఇప్పుడు పిన్‌ను నమోదు చేయకుండానే రూ. 200 వరకు చెల్లింపులు చేయవచ్చు. టూపీఐ లైట్‌కి రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించుకోవచ్చు. 

ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కేంద్రం శుభవార్త, త్వరలో.. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top