జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు!

Maruti Suzuki Jimny SUV not launching in India this may month - Sakshi

మారుతి సుజుకి జిమ్నీ ప్రియులకు నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. మహీంద్రా థార్ కు పోటీగా వస్తున్న మారుతి సుజుకి జిమ్నీ కోసం కొనుగోలుదారులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే జిమ్నీ భారత్ లో  మే నెలలో విడుదల కావడం లేదని తెలుస్తోంది. 

మారుతి సుజుకి జిమ్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో అరంగేట్రం చేసింది. ఈ SUV మే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావించారు. అయితే తాజా నివేదికల ప్రకారం..  మారుతి సుజుకి జిమ్నీ లాంచ్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. 

24,500 పైగా బుకింగ్‌లు 
దేశంలో జిమ్నీ కోసం ఇప్పటి వరకు 24,500 కుపైగా బుకింగ్‌లు వచ్చాయి. జూన్ మొదటి వారంలో లాంచ్ అయిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 5-డోర్ల జిమ్నీ కంపెనీ.. మారుతి సుజుకి గుర్గావ్ ప్లాంట్‌లో తయారవుతోంది. ఆటోమొబైల్ సమాచార సంస్థ కార్టాక్ ప్రకారం, దేశీయ, విదేశీ డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి నెలా 7,000 యూనిట్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఇందులో ఆల్ఫా ట్రిమ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జిమ్నీ రంగుల విషయానికి వస్తే కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్ కలర్లను చాలా మంది ఇష్టపడుతున్నారు. 

రూ. 10 లక్షల నుంచి ప్రారంభం 
లీక్ అయిన డీలర్ ఇన్‌వాయిస్ ప్రకారం.. భారత్ లో మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ జీటా వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన లైన్ ఆల్ఫా వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ భారత్ లో నెక్సా షోరూమ్‌ల ద్వారా బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top