డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా?

Book Train Tickets On IRCTC Portal And Pay Later With Paytm Postpaid - Sakshi

డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్‌ యాప్ లో ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL) ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం క్యాషీ (CASHe)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలలలో ఈఎంఐల ద్వారా తర్వాత చెల్లించవచ్చు.

ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం

పేటీఎంలో పోస్ట్‌పెయిడ్ సదుపాయం ఉండటం వల్ల  రైల్వే టికెటింగ్ సర్వీసుల్లో బుక్ నౌ పే లేటర్ ఆప్షన్ ను పేటీఎం యూజర్లు వినియోగించుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటీవలి కాలంలో పేటీఎం తమ యూజర్ల కోసం టికెట్ల బుకింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, షాపింగ్ లలో బై నౌ పే లేటర్ సదుపాయాన్ని విరివిగా కల్పిస్తోంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 30 రోజుల వ్యవధికి రూ. 60 వేల వరకు వడ్డీ రహిత రుణాన్ని అందిస్తోంది.

టికెట్ బుకింగ్ ఇలా.. 

  • ఐఆర్సీటీసీ అధికారిక పోర్టల్‌ లేదా మొబైల్‌లో ఐఆర్సీటీసీ యాప్‌లో లాగిన్ అవ్వాలి. 
  • మీ వెళ్లాల్సిన ప్రాంతం, ప్రయాణ తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి.
  • తర్వాత చెల్లింపు విభాగానికి వెళ్లి 'పే లేటర్'పై క్లిక్ చేయండి.
  • పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ని ఎంచుకుని, మీ పేటీఎం వివరాలతో లాగిన్ చేయండి.
  • తర్వాత OTPని నమోదు చేస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది.

ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్!
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top