అదానీ- హిండెన్‌బర్గ్‌ వివాదం.. డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ కేపీ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Adani-Hindenburg row has not shaken faith of global investors - Sakshi

డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ కేపీ సింగ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి గాధపై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్, అదానీ గ్రూప్‌ వివాద ప్రభావమేమీ ఉండబోదని రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ కేపీ సింగ్‌ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక కార్పొరేట్‌ గ్రూప్‌నకు మాత్రమే పరిమితమైన విషయమే తప్ప, దీనితో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌పై నమ్మకమేమీ సడలబోదని పేర్కొన్నారు.

పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉంటాయనే అభిప్రాయాలను సింగ్‌ తోసిపుచ్చారు. అయితే అధిక వృద్ధి బాటలో ముందుకెళ్లాలంటే అదానీ గ్రూప్‌ రుణభారాన్ని తగ్గించుకుని, పెట్టుబడిని పెంచుకోవాలని సూచించారు. భారీగా షేర్ల విక్రయాల సమయంలో కొందరు బ్లాక్‌మెయిలర్లు నివేదికలతో బైటికొస్తుంటారని చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top