రానున్న బడ్జెట్‌ సెషన్‌లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?

Adani Group vs Hindenburg Research storm is likely to hit Budget Session 2023 - Sakshi

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ రీసెర్చ్  వివాదం సెగ రానున్న బడ్జెట్‌ సెషన్‌ను భారీగానే తాగనుంది.  ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణలు, డిమాండ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే 2023 బడ్జెట్ సమావేశాల్లో ప్రకంపనలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయని  రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌   రిపోర్ట్‌పై అదానీ గ్రూప్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ దుమారాన్ని రేపింది. 413 పేజీలతో అదానీ గ్రూపు ఇచ్చిన వివరణమరింత ఆజ్యం పోసింది.  అమెరికన్‌ షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా తప్పులతడకలని అదానీ గ్రూప్‌ వ్యాఖ్యానించింది. ఇది ఏదో ఒక కంపెనీపై ఊరికే చేసిన దాడి కాదని.. లాభనష్టాలు  అన్నింటినీ బేరీజు వేసుకుని భారత్‌పైనా .. భారతీయ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యతపైనా .. భారత వృద్ధి గాధ, ఆకాంక్షలపైనా చేసిన దాడి అని అభివర్ణించింది. దీంతో ప్రతిపక్షాలు  విమర్శలు గుప్పించాయి. అదానీ  ఎపుడు ఇండియాగా మారిపోయారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ నేత వైసతీష్ రెడ్డి  ప్రశ్నించారు. ఈ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పడం లేదంటూ ముఖ్యంగా కాంగ్రెస్‌, శివసేన నాయకులు విమర్శలు గుప్పించారు. దీంతో  ఈ వివాదం పార్లమెంటులో రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రభావం చూపవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ అదానీ ఎప్పుడు భారతదేశంగా మారిందని ప్రశ్నించారు. అలాగే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ షేర్లు (రెండు రోజుల్లో రూ.22,442 కోట్లు)కుప్పకూలడంపై ఆందోళన వ్యక్తం చేశారు.  క్రోనీస్ కోసం  29 కోట్ల పాలసీదారులతో  దేశ "లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్"!ను  మోడీ ప్రభుత్వం  లూట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. (అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్‌)

శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది  కూడా  అదానీ గ్రూప్ అంటే ఇండియా, ఇండియా అంటూ అదానీ గ్రూప్ అంటూ సెటైర్లు వేశారు. అమెరికాలోని ఒక చిన్న సంస్థ బహిర్గతం చేసేదాకా ఆర్థిక మంత్రి ఇంతకాలం ఏమి చేస్తున్నారు? సెబీ ఎక్కడ ఉంది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్కడ ఉంది? 2022లో మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో దాదాపు 80 శాతం వాటాను ఒక గ్రూపు కలిగి ఉంది అంటూ  కాంగ్రెస్ నాయకుడు సంజయ్ ఝా విమర్శించారు. 

కాగా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2023ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. మరి ఈ వివాదంపై పార్లమెంట్‌ సమావేశాల్లో  రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-02-2023
Feb 04, 2023, 13:57 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్‌ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్‌...
03-02-2023
Feb 03, 2023, 03:59 IST
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ నితిన్‌...
02-02-2023
Feb 02, 2023, 10:48 IST
న్యూఢిల్లీ: ఈసారి విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,12,898.97 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు విద్యాశాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు...
02-02-2023
Feb 02, 2023, 10:33 IST
కేంద్ర బడ్జెట్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి దక్కింది చాలా తక్కువే. ఒకట్రెండు హామీలు...
02-02-2023
Feb 02, 2023, 09:11 IST
‘ఈ జగమంతా రామమయం’ అన్నాడు ఆనాటి రామదాసు!  ఈ నాటి నిర్మలా సీతారామమ్మ బడ్జెట్‌ పాట కూడా ఇదే. కాకపోతే.. జగము స్థానంలో భారత్‌ అని.....
02-02-2023
Feb 02, 2023, 06:29 IST
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా...
02-02-2023
Feb 02, 2023, 06:01 IST
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్లు (ఈవీఎం) కొనుగోలు చేయడానికోసం కేంద్ర న్యాయశాఖకు ఈ బడ్జెట్‌లో దాదాపు రూ.1,900 కోట్లను కేటాయించారు....
02-02-2023
Feb 02, 2023, 05:53 IST
న్యూఢిల్లీ: అమృత్‌కాల్‌లో ప్రవేశపెట్టబడిన తొలి బడ్జెట్‌ ఇదేనంటూ బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ‘ గత బడ్జెట్‌ వేసిన...
02-02-2023
Feb 02, 2023, 05:47 IST
న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు...
02-02-2023
Feb 02, 2023, 05:32 IST
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి పొదుపు కంటే ఖర్చులను ప్రోత్సహించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు...
02-02-2023
Feb 02, 2023, 04:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతున్నా, ఈ బడ్జెట్‌లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు...
02-02-2023
Feb 02, 2023, 04:40 IST
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ విశాఖపట్నం రైల్వే జోన్‌ కూత వినిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
02-02-2023
Feb 02, 2023, 04:26 IST
న్యూఢిల్లీ: వేతన జీవుల కోసం వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేటు పరిమితి పెంపు. మధ్య తరగతి, మహిళలు, పెన్షనర్ల కోసం...
02-02-2023
Feb 02, 2023, 04:09 IST
బడ్జెట్లో వృద్ధి మంత్రంతో తారాజువ్వలా దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు... అంతలోనే చప్పున చల్లారిపోయాయి. మౌలిక రంగానికి భారీగా కేటాయింపులను పెంచుతూ.....
02-02-2023
Feb 02, 2023, 04:00 IST
నిధులివ్వలేదు.. గ్యారెంటీ లేదు.. ప్రాజెక్టుల ఊసు లేదు.. ఏ గ్రాంటు కిందా కేటాయింపులు లేవు.. రెండు మూడు రాష్ట్రాలతో కలిపి కొన్ని అంశాల్లో...
02-02-2023
Feb 02, 2023, 03:47 IST
ఇదే కాదు... కొన్నేళ్ళుగా బడ్జెట్‌ల స్వరూపాలను చూస్తే ఇవి బడుగులకు బాసటగా ఉంటున్నాయా? కార్పొరేట్లకు కొమ్ముగాస్తు న్నాయా అనే సందేహా...
01-02-2023
Feb 01, 2023, 19:27 IST
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ).. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది...
01-02-2023
Feb 01, 2023, 19:22 IST
2023-24 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఇన్‌కంటాక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన...
01-02-2023
Feb 01, 2023, 18:17 IST
న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్‌లో  కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌గా...
01-02-2023
Feb 01, 2023, 17:09 IST
వచ్చే ఏడాదిలో ఎన్నికలు. కాబట్టి, ఇదే చివరి బడ్జెట్‌. పేదమధ్యధనిక వర్గాలు ఎన్నో అంచనాలు.. 



 

Read also in:
Back to Top