Tony Abbott Dismissed Allegations Of Fraud By Hindenburg Against Adani Group - Sakshi
Sakshi News home page

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలన్నీ అవాస్తవాలే.. అదానీపై ఎంతో గౌరవం ఉంది..ఆస్ట్రేలియా మాజీ ప్రధాని అబాట్‌

Mar 5 2023 12:46 PM | Updated on Mar 5 2023 2:38 PM

Tony Abbott Dismissed Allegations Of Fraud By Hindenburg Against Adani Group - Sakshi

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తోసిపుచ్చారు. రెగ్యులేటర్లు ఈ విషయాన్ని పరిశీలిస్తారని, తనకు సంబంధించినంత వరకు ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ‘‘ఆరోపణలు చేయడం చాలా తేలిక. ఏదో ఆరోపణ చేసినంత మాత్రాన అది నిజం కాదు. నేరం రుజువయ్యే వరకు మీరు నిర్దోషే’’ అని చెప్పే న్యాయ సూత్రాల గురించి ప్రస్తావించారు. 

అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ చేస్తున్న ఆరోపణలపై భారత్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో టోనీ అబాట్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై అదానీ గ్రూప్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞుడను. తన దేశంలో బిలియన్ల డాలర్ల విలువైన అదానీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు. ఆ పెట్టుబడులతో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు, సంపద సృష్టించామని చెప్పారు.

అంతేకాదు ఆస్ట్రేలియా నుంచి అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గు సహాయంతో.. భారత్‌లో నిరంతరం విద్యుత్తును అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయం చేశారని గౌతమ్‌ అదానీపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి అదానీ గ్రూప్‌పై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం సరికాదని, హిండెన్‌ బర్గ్‌ చేస్తున్న అసత్య ఆరోపణల్ని ఖండిస్తున్నట్లు టోనీ అబాట్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్‌పై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు!

అదానీ అండగా టోనీ అబాట్‌
కాగా,2015లో అబాట్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆస్ట్రేయాలియాలో అదానీ కార్మైకేల్‌ సంస్థ బొగ్గు గనుల్ని వెలికితీసేందుకు పూనుకుంది. ఆ బొగ్గు వెలికి తీతపై స్థానిక కోర్టు తీవ్రంగా ఖండించింది. గనుల పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. దీన్ని ఖండించిన అబాట్‌ ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల విస్తృతస్థాయి ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ అదానీ గ్రూప్‌కు అండగా నిలిచారు. ఎట్టకేలకు 2019లో అదానీ గ్రూప్‌నకు తుది అనుమతులు లభించాయి. అక్కడి నుంచి వెలికితీసిన బొగ్గునే ఇప్పుడు అదానీ గ్రూప్‌ భారత్‌కు సరఫరా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement