సత్యమే గెలుస్తుంది: గౌతం అదానీ

Supreme Court directs Sebi to probe Gautam Adani responds - Sakshi

సాక్షి, ముంబై: అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్‌ వివాదంలో సుప్రీంకోర్టు  తాజా ఆదేశాలపై అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతం అదానీ స్పందించారు. సమయాను కూలంగా నిజాలు  నిగ్గు తేలతాయని... సత్యమే  గెలుస్తుంది అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్బంగా  సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు.  

(ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు)

హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌పై  దాఖలైన పిటిషన్లను విచారించిన  సుప్రీం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అదానీ గ్రూప్‌ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించింది. రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా  రెగ్యులేటరీ బాడీని కూడా కోర్టు  ఆదేశించింది. అలాగే ఆరుగురు నిపుణులతో ఒక కమిటీని కూడా  నియమించిన సంగతి తెలిసిందే.

కాగా అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలన్నింటినీ ఇప్పటికే అదానీ కొట్టిపారేశారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఖండిస్తూ అదానీ గతంలోనే గ్రూపు సమూహం 413 పేజీల ప్రతిస్పందనను కూడా విడుదల చేసింది. హిండెన్‌బర్గ్ ,వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్‌పై  ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని సెబీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ జరిపి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని  కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్‌లో కోరారు. దీంతోపాటు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై  విచారణ జరగాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్,  ఒకసామాజిక కార్యకర్త కూడా  ఒక పిటిషన్‌  దాఖలు చేశారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top