రాహుల్‌.. అదానీపై రేవంత్‌ను డిమాండ్‌ చేస్తారా?: కేటీఆర్‌ | BRS MLA KTR Strong Political Counter To Congress Party | Sakshi
Sakshi News home page

రాహుల్‌.. అదానీపై రేవంత్‌ను డిమాండ్‌ చేస్తారా?: కేటీఆర్‌

Aug 13 2024 7:19 PM | Updated on Aug 13 2024 7:28 PM

BRS MLA KTR Strong Political Counter To Congress Party

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సెబీపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. అదానీ దేశానికి తప్పు అయితే.. తెలంగాణకు ఎలా కరెక్ట్‌ అని ప్రశ్నించారు.

కాగా, ట్విట్టర్‌ వేదికగా.. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. ఆగస్టు 22న అదానీ-సెబీ బంధంపై హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చినందున కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చినందుకు సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రెండు విధాల ధోరణి అవలంబించటాన్ని మేము గమనిస్తున్నాం.

 

 

అదానీ భారతదేశానికి తప్పు అయితే, తెలంగాణకు ఎందుకు, ఎలా సరైనది?. అదానీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తారా?. ఇది కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కానీ.. నమ్మకం గురించి కాదా?. తెలంగాణ భవిష్యత్‌కు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుంది. మరి కాంగ్రెస్‌ నిలుస్తుందా? అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement