Today Market Closing ఐటీ,అదానీ షేర్ల  జోష్‌, వారాంతంలో సెన్సెక్స్‌  దూకుడు 

Sensex up 298 pts Nifty ends at 18200 - Sakshi

ఐటీ జోష్‌, ఫార్మా నీరసం

18200  ఎగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో హుషారుగా ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు ఆ తర్వాత పుంజుకున్నాయి. ప్రధానంగా హిండెన్‌బర్గ్‌ అదానీ గ్రూపు వివాదంలో సుప్రీం తీర్పు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో  అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.దీనికి తోడు ఐటీషేర్లలో ర్యాలీ ఊతమిచ్చింది. ఫార్మా రంగ షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్ 298  పాయింట్ల లాభంతో 61730  వద్ద,   నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 18203 వద్ద ముగిసాయి. 

అదానీ కేసులో  సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యుల ప్రత్యేక ప్యానెల్‌  ప్రస్తుత దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది.  అలాగే 13 ఎఫ్‌పిఐల వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారులకు గ్రూప్‌తో లింక్ ఉందో లేదో  నిర్ధారించేందుకు ఇంకా   ఎక్కువ సమయం కావాలని సెబీ కోరింది. దీంతో అదానీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.

అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎయిర్టెల్‌, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, హిందాల్కొ షేర్లు  టాప్ గెయినర్లుగా నిలిచాయి. (భారీ ఊరట: తగ్గిన పసిడి ధర, మరింత దిగొచ్చే అవకాశం!)

అటు దివీస్ ల్యాబ్, బ్రిటానియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ లైఫ్, హీరో మోటార్స్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, నెస్లే, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో  ముగిసాయి.అటు  గురువారం  82.59 ముగింపుతో పోలిస్తే డాలర్‌ మారకంలో  భారత రూపాయి స్వల్పంగా తగ్గి 82.66 వద్ద ముగిసింది. 

మరిన్ని మార్కెట్‌ వార్తలు, ఇతర ఇంట్రస్టింగ్‌ బిజినెస్‌ న్యూస్‌కోసం చదవండి: సాక్షి, బిజినెస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top