అదానీ ఆస్తులను జాతీయం చేయండి: మోదీకి బీజేపీ సీనియర్‌ నేత సంచలన సలహా

Nationalise the entire commercial properties of Adani Co says Subramanian Swamy - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ  హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌   సంచలన రిపోర్ట్‌తో అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతం విలవిల్లాడుతుండగా బీజేపీ సీనియర్‌ సుబ్రమణియన్‌ స్వామి సంచలన వ్యాఖ్యలు  చేశారు.  అదానీ వివాదంపై సోషల్‌మీడియా ద్వారా స్పందించిన ఆయన  ప్రధాని మోదీకి ఒక సలహా కూడా ఇచ్చారు.  (షాకింగ్‌ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో)

అదానీగ్రూపు - హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో సుబ్రమణియన్‌ స్వామి గురువారం ట్విటర్‌లో స్పందించారు.  అదానీ & కో  మొత్తం వాణిజ్య ఆస్తులను జాతీయం చేయాలని, ఆపై ఆ ఆస్తులను విక్రయించాలంటూ ప్రధాని మోదీకి సలహా ఇచ్చారు. అంతేకాదు అదానీని హోప్‌లెస్‌గా భావించిన  మోదీ ప్రభుత్వం నెమ్మదిగా అదానీని డిస్‌ ఓన్‌ చేసుకుంటోందనీ,  ఎలా వచ్చిన వాళ్లు అలానే పోతారు అంటూ ఆయన సంచలన ట్వీట్‌ చేశారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top