కార్పొరేట్లకు ‘హిండెన్‌బర్గ్‌’ తరహా షాక్‌! | George Soros-backed group plans expose on Indian firms | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు ‘హిండెన్‌బర్గ్‌’ తరహా షాక్‌!

Aug 25 2023 3:28 AM | Updated on Aug 25 2023 3:28 AM

George Soros-backed group plans expose on Indian firms - Sakshi

న్యూఢిల్లీ: కొద్ది నెలల క్రితం పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తరహాలో మరో సంస్థ దేశీ కార్పొరేట్‌ గ్రూప్‌ల అవకతవకలను బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాక్‌ఫెలర్‌ బ్రదర్స్‌ ఫండ్, జార్జ్‌ సొరోస్‌ వంటి దిగ్గజాల దన్ను గల ఓసీసీఆర్‌పీ (ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోరి్టంగ్‌ ప్రాజెక్టు) సన్నద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వ్యాప్తంగా ఉన్న 24 లాభాపేక్షరహిత ఇన్వెస్టిగేటివ్‌ సంస్థలు కలిసి ఈ పరిశోధనాత్మక రిపోరి్టంగ్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. అవి త్వరలోనే ఏదైనా నివేదిక లేదా వరుస కథనాలను ప్రచురించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

ముందుగా ఒక నిర్దిష్ట కార్పొరేట్‌ కంపెనీలో విదేశీ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయడానికి సంబంధించిన అవకతవకలను బయటపెట్టవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే సదరు కార్పొరేట్‌ సంస్థ పేరును మాత్రం వెల్లడించలేదు. 2006లో ఏర్పాటైన ఓసీసీఆర్‌పీ వెబ్‌సైట్‌ ప్రకారం సంఘటిత నేరాలను శోధించడం సంస్థ ప్రత్యేకత. ఇన్వెస్టర్‌ జార్జ్‌ సొరోస్‌కి చెందిన ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్, ఫోర్డ్‌ ఫౌండేషన్, ఓక్‌ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్‌ బ్రదర్స్‌ ఫండ్‌ మొదలైనవి దీనికి నిధులు సమకూరుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement