Hindenburg's report: చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్‌’ బాగోతం ఇదే..

Hindenburg's accusations against Block and Jack Dorsey - Sakshi

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని అమెరికా మొబైల్ చెల్లింపు సంస్థ ‘బ్లాక్‌’పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది. అవకతవకలకు పాల్పడిదంటూ ఆరోపించింది. ఈ నివేదిక ప్రకారం.. గతంలో స్వేర్‌ (Square Inc) అనే పేరుతో ఉన్న ఈ బ్లాక్‌ (Block Inc) సంస్థ మార్కెట్ విలువ  44 బిలియన్‌ డాలర్లు.  బ్యాంక్‌ ఖాతాలు లేనివారి కోసం ఈ సంస్థ సరికొత్త ఆర్థిక సాంకేతికతను అభివృద్ధి చేసింది.

ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్‌ లేటెస్ట్‌ రిపోర్ట్‌: భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ అమృత ఆహూజా పాత్ర ఏంటి?

అయితే అదే టెక్నాలజీ ఆధారంగా వినియోగదారులను పెంచుకున్న బ్లాక్‌ సంస్థ దాన్ని అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించింది. వినియోగదారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోసాన్ని సులభతరం చేయడం, నియంత్రణను నివారించడం, రుణాలు, ఫీజుల దోపిడీని విప్లవాత్మక సాంకేతికతగా మార్చిందని ఆక్షేపించింది. యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది. 

40 నుంచి 75 శాతం అకౌంట్లు ఫేక్‌వే 
కరోనా సంక్షోభం అనంతరం బ్లాక్‌ క్యాష్ యాప్ పురోగతి చాలా మంది విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లాక్ తన యూజర్ల సంఖ్యను ఎక్కువగా చూపిందని, అదే సమయంలో ఖర్చులను తక్కువగా చూపించిందని హిండెన్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది. బ్లాక్‌ కస్టమర్ల అకౌంట్లలో 40 నుంచి 75 శాతం ఫేక్‌వేనని ఆరోపించింది. కోవిడ్‌ సమయంలో 18 నెలల్లో 639 శాతం పెరిగిన బ్లాక్ స్టాక్‌కు కొత్త వ్యాపారం ఒక్కసారిగా పెరుగుదలను అందించిందని నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!

జాక్ డోర్సీపై ఆరోపణలు
జాక్ డోర్సే బ్లాక్‌లో మోసాన్ని సులభతరం చేశారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడైన డోర్సే 2015 నుంచి 2021 వరకు దాని సీఈవోగా పనిచేశారు. కోవిడ్‌ సమయంలో బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌లను డంప్ చేయడం ద్వారా ఆయన లాభపడ్డారని హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ ఆరోపించింది.  బ్లాక్‌ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వే ఇద్దరూ 1 బిలియన్‌ డాలర్ల స్టాక్‌ను విక్రయించారని పేర్కొంది. సీఎఫ్‌వో అమృతా అహుజాతో సహా ఇతర అధికారులు, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియా కూడా మిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను డంప్ చేశారని ఆరోపించింది.

ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరుతో కూడా..
బ్లాక్‌ క్యాష్‌ యాప్‌లో జాక్ డోర్సీకి అనేక ఫేక్‌ ఖాతాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ పేరిట కూడా డజన్ల కొద్దీ నకిలీ ఖాతాలు కూడా ఉన్నాయని వివరించింది.

ఇదీ చదవండి: పిన్‌ అవసరం లేదు!.. పేమెంట్‌ ఫెయిల్‌ అయ్యే సమస్యే లేదు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top