హిండెన్‌బర్గ్‌ లేటెస్ట్‌ రిపోర్ట్‌: భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ అమృత ఆహూజా పాత్ర ఏంటి?

Who is Hindenburg latest target Block CFO Indian Origin Amrita Ahuja - Sakshi

న్యూఢిల్లీ:యూఎస్‌ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  ట్విటర్‌ మాజీ సీఈవో జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్‌పై వెల్లడించిన రిపోర్ట్‌ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బ్లాక్‌ఇంక్‌ ఏంటి?  సహ వ్యవస్థపాకులతోపాటు  ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఈ కంపెనీ భారతీయ-అమెరికన్  సీఎఫ్‌వో అమృతా అహుజా గురించిన వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్‌ ఇంకపై హిండెన్‌బర్గ్ గురువారం కీలక రిపోర్ట్‌ను వెల్లడించింది. జాక్‌ డోర్సే జేమ్స్ మెక్‌కెల్వీతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమృతా అహుజా, క్యాష్ యాప్‌ లీడ్ మేనేజర్, బ్రియాన్ గ్రాసడోనియాతో సహా పలు కీలక ఎగ్జిక్యూటివ్‌లు "మిలియన్ల డాలర్లను స్టాక్‌లో పెట్టారని " ఆరోపించింది. (ట్విటర్‌ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు)

పెట్టుబడిదారులను మోసం చేసేందుకు కస్టమర్లను ఎక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. రిపోర్ట్‌ ప్రకారం మోసంద్వారా వచ్చిన లాభాలను దోచు కున్నారని,  ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో  జాక్ డోర్సే , జేమ్స్ మెక్‌ కెల్వే సమిష్టిగా 1 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. అలాగే సీఎఫ్‌వో అమృతా అహుజా సహా ఇతర ఎగ్జిక్యూటివ్స్‌పై కూడా  విమర్శలు గుప్పించింది. 

అమృతా అహుజా ఎవరు?
అహుజా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డ్యూక్ యూనివర్సిటీ , హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి ప్రీమియం విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థి.
2019లో బ్లాక్‌లో చేరడానికి ముందు, ఆమె ఎయిర్‌బిఎన్‌బి, మెకిన్సే & కంపెనీ, ది వాల్ట్ డిస్నీ కంపెనీ వంటి  దిగ్గజాలతో కలిసి పనిచేసింది.
ఆమె 2001లో కన్సల్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్  నివేదిక ప్రకారం, అహుజా క్లీవ్‌ల్యాండ్ శివారులో డే-కేర్ సెంటర్‌ నిర్వహించే భారతీయ వలసదారుల కుమార్తె.
ఫాక్స్‌లో పనిచేస్తున్నప్పుడు, స్ట్రీమింగ్ సర్వీస్ హులును ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.  
"కాల్ ఆఫ్ డ్యూటీ," "కాండీ క్రష్" , "వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్" వంటి  పాపులర్‌ గేమ్‌ల వీడియో గేమింగ్ కంపెనీ యాక్టివిజన్‌ బ్లిజారే కంపెనీకి  అభివృద్ధిలో తోడ్పడింది. ఆన్‌ స్టోర్‌   బిజినెస్‌ మోడల్‌నుంచి,ఆన్‌లైన్,  ఆల్వేస్‌​ ఆన్‌ లాంటి  మల్టీప్లేయర్ వ్యాపార నమూనాతో అమ్మకాలతో  దుమ్ము రేపేలా సాయపడింది.  
 ఆమె 2022లో ఫార్చ్యూన్ యొక్క అత్యంత శక్తివంతమైన మహిళా సమ్మిట్‌లో కనిపించింది.
 భర్త హర్‌ప్రీత్ మార్వాహ. 7 , 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు.
 తొలి ఉద్యోగం: ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ హైట్స్‌లోని ఆమె తల్లిదండ్రుల డేకేర్‌లో  సమ్మర్‌ క్యాంప్‌ కౌన్సెలర్

 ఇవీ చదవండి: రూ. 32 వేల బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 1,999కే 

సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top