హిండెన్‌బర్గ్‌పై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు!

Those Who Made Money At Cost Of Middle-class Investor: Harish Salve Says, Probe Hindenburg - Sakshi

అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్, అదానీ గ్రూప్‌ వివాదంపై మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్‌ ‘నో గుడ్‌ స్మార్టానీయన్‌’.అందుకు పూర్తిగా విభిన్నమైంది. మిడిల్‌ క్లాస్‌ ఇన్వెస్టర్ల నుంచి డబ్బుల్ని కొల్లగొట్టడం విచారకరమని అన్నారు.

హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ - అదానీ గ్రూప్‌ అంశంపై ఓ మీడియా సంస్థ నిర్వహించిన డిబెట్‌లో పాల్గొన్న హరీష్‌ సాల్వే.. హిండెన్‌ బర్గ్‌ తీరును విమర్శించారు. హిండెన్‌ బర్గ్‌ నో స్మార్టానీయన్‌. అవకాశావాది. తమకు అనుగుణంగా నివేదికను విడుదల చేయడం, మళ్లీ అదే నివేదికను కనుమరుగు చేయడం ఏంటని ప్రశ్నించారు. హిండెన్​బర్గ్​ సంస్థను 'అనైతిక షార్ట్​ సెల్లర్​'గా అభివర్ణించారు. 

ఈ సందర్భంగా  సుప్రీంకోర్టు ధర్మాసనం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీ అదానీ- హిండెన్‌ బర్గ్‌ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేలుస్తుందని అన్నారు. షేర్‌ వ్యాల్యూని తగ్గించి టన్నుల కొద్ది మిడిల్‌ క్లాస్‌ ఇన్వెస్టర్ల పెట్టబుడుల్ని కాజేసింది ఎవరనేది స్పష్టం చేస్తుందని తెలిపారు.    

హిండెన్‌ బర్గ్‌ స్టాక్‌ మార్కెట్‌ను మానిప్యులేషన్ చేయడంలో దిట్ట. ఆ సంస్థ ట్రేడింగ్‌ చేయకుండా నిషేధం విధించాలి. ఉదాహరణకు కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లోని మదుపర్లని మోసం చేస్తున్నాయని నిజంగా అనిపిస్తే.. అందుకు తగ్గ ఆధారాలుంటే వెంటనే భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తే విచారణ జరిపిస్తారు. 

కానీ అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ అలా చేయలేదు. డైరెక్ట్‌గా రిపోర్ట్‌లను అడ్డం పెట్టుకొని కంపెనీలపై దాడులకు పాల్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా అని సెబీ చూస్తూ కూర్చొదుగా. ఎవరు స్టాక్‌ మార్కెట్‌లోని అలజడని సృష్టించి తద్వారా డబ్బుల్ని సంపాదిస్తున్నారు. మిడిల్‌ క్లాస్‌ ఇన్వెస్టర్ల డబ్బుల్ని కాజేస్తున్నారో ఇలా అందర్ని వెలుగులోకి తెస్తుందన్నారు. 

మనదేశంలో ఇదో కొత్త గేమ్‌. కేపిటల్‌ మార్కెట్‌ వృద్ది సాధిస్తోంది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్టైన ప్రతి కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులు మక్కువ చూపుతుంటారు. హిండెన్‌ బర్గ్‌ లాంటి రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చి.. అవి అబ్ధమని రుజువయ్యే సమయానికి సదరు కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింతుందని వెల్లడించారు.
 
కాగా, సుప్రీం కోర్ట్‌ ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆరుగురు సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే, ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్, రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేపీ దేవధర్, ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ కేవీ కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖరన్ సుందరేశన్ ఉన్నారని మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top