రాహుల్‌ గాంధీ.. యమా డేంజర్‌ : కంగనా రనౌత్‌ | Kangana Ranaut Hits Out Over Hindenburg Remark, Says Rahul Gandhi Most Dangerous Man | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ.. యమా డేంజర్‌ : కంగనా రనౌత్‌

Aug 12 2024 11:56 AM | Updated on Aug 12 2024 12:44 PM

Rahul Gandhi most dangerous man : Kangana Ranaut hits

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి  అని అన్నారు బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌ బర్గ్ భారత్‌ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ చైర్‌పర్సన్‌ మధబి బుచ్‌పై పలు ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు మద్దతిస్తూ..ప్రధాని మోదీ, సెబీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కంగనా స్పందించారు.

ఎక్స్‌ వేదికగా.. రాహుల్‌ గాంధీ దేశ భద్రత,ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి. అతను ప్రధానమంత్రి కాలేకపోతే తను ఈ దేశాన్ని కూడా నాశనం చేయాలనుకోవడమే అతని ఎజెండా’ అని కంగనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement