అదానీVsహిండెన్‌బర్గ్‌: ఆర్‌బీఐ,సెబీపై ఆర్థికమంత్రి ఏమన్నారంటే!

Adani Hindenburg Nirmala Sitharaman says Regulators should always be on their toes - Sakshi

ఈక్విటీ మార్కెట్ల స్థిరీకరణ రెగ్యులేటర్ల లక్ష్యం కావాలి: ఆర్థికమంత్రి 

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ల స్థిరీకరణ నియంత్రణ సంస్థలు... రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెబీల ప్రధాన ధ్యేయం కావాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో రెగ్యులేటర్లు పూర్తి విజయవంతంగా పని చేస్తున్నాయని కూడా ఉద్ఘాటించారు. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ, మార్కెట్లను స్థిరంగా ఉంచడానికి నియంత్రణ సంస్థలు సమయానికి పని చేయాలన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక కుట్ర కాదా అని అడిగినప్పుడు సీతారామన్ ఈ వ్యాఖ్య చేశారు. ఈ మేరకు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అదానీ గ్రూప్‌ సంక్షోభ పరిస్థితులపై అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, అది ఈ గ్రూప్‌ కంపెనీలకు మాత్రమే సంబంధించిన సమస్యని స్పష్టం చేశారు. ఏ కంపెనీకి కూడా భారత్‌ బ్యాంకులు భారీ స్థాయిలో రుణాలు ఇవ్వలేదని, బీమా కంపెనీల పెట్టుబడులు కూడా భారీగా లేవని అన్నారు.  
 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top