అదానీ సెగ: ఎల్‌ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి

LIC loses Rs 18k crore in just 2 days as Adani group stocks crash chek dets - Sakshi

సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-హిండెన్‌బర్గ్ వివాదం అదానీలో పెట్టుబడి పెట్టిన సంస్థలు, బ్యాంకులు, ఇతర పెట్టుబడిదారులను చుట్టుకుంది. గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ క్రాష్ కావడంతో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) భారీగా ప్రభావితమైంది.

ఎల్ఐసీ కేవలం 2 రోజుల్లోనే రూ.18,000 కోట్లు నష్టాన్ని మూటగట్టకుంది. అటు అదానీ షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్‌మార్కెట్‌ శుక్రవారం భారీ పతనాన్ని నమోదు చేసింది. తాజా డేటా ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఎల్‌ఐసీ సంయుక్త పెట్టుబడి జనవరి 24, 2023న రూ.81,268 కోట్లగా ఉండగా,  జనవరి 27, 2023న రూ.62,621 కోట్లకు పడిపోయింది. అంటే  రూ.18,647 కోట్ల  మేర ఎల్‌ఐసీ నష్టపోయింది. 

కాగా అదానీ గ్రూపు కంపెనీల ఆర్థిక వ్యవహారాల్లో దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్‌ బర్గ్‌ నివేదికను విడుదల చేసింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గడిచిన మూడేళ్లలో ఏకంగా 100బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఏడు లిస్టెడ్ కంపెనీలు, 85 శాతం నష్టాన్ని, గణనీయమైన రుణాలను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే దీనిపై చట్టపరమైన చర్య తీసుకోనున్నట్టు అదానీ ప్రకటించింది.  అదానీ ఎంటర్‌ప్రైజెస్  ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను దెబ్బతీసే ప్రధాన లక్ష్యంతో తమప్రతిష్టను దెబ్బతీయాలనే ఈ కుట్రపన్నారని పేర్కొంది. దీనిపై హిండెన్‌బర్గ్ కూడా స్పందించింది. తన నివేదికలోని అంశాలకు  కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top