అదానీ-హిండెన్‌బర్గ్‌ సంక్షోభం: వారికి ఆనంద్‌ మహీంద్ర హెచ్చరిక

Anand Mahindra alludes to Adani Group crisis in latest tweet - Sakshi

సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ రేపిన దుమారంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎంఅండ్‌ఎం చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. తన తాజా ట్వీట్‌లో అదానీ గ్రూప్ సంక్షోభాన్ని ప్రస్తావించారు.ఎన్ని సవాళ్లు వచ్చినా భారత్‌ దృఢంగా నిలబడుతుంది అంటూ సోషల్‌మీడియాలో ప్రకటించారు. (కుప్పకూలుతున్న అదానీ: డౌ జోన్స్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఔట్‌)

వ్యాపార రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థికశక్తిగా ఉండాలనే భారతదేశ ఆశయాలను దెబ్బతీస్తాయా అని గ్లోబల్ మీడియా అనేక ఊహాగానాలు చేస్తోంది కానీ అలాంటిదేమీ ఉండదు.  ఎన్ని తుఫానులు, సంక్షోభాలు వచ్చినా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉంటుందని  ప్రకటించారు.

ఇండియా గతంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొందని, కానీ ప్రతిసారీ బలంగా నిలబడిందని ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యానించారు. భూకంపాలు, కరువులు, మాంద్యాలు, యుద్ధాలు,  ఉగ్రదాడులు లాంటివి ఎన్నో చూశా.. తాను చెప్పేది ఒక్కటే, భారతదేశానికి వ్యతిరేకంగా ఎపుడూ సవాల్‌  చేయొద్దని సూచించారు. అలా అమెరికా షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై మోపిన అకౌంటింగ్ మోసం ఆరోపణల నేపథ్యంలో అనేక ఊహాగానాలు చేస్తున్న వారిని పరోక్షంగా ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు.

/p>

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top