టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు | Tata Motors to Hike Commercial Vehicle Prices from April 1 | Sakshi
Sakshi News home page

టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు

Mar 19 2026 3:29 PM | Updated on Mar 19 2026 4:48 PM

Tata Motors to Hike Commercial Vehicle Prices from April 1

న్యూడిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి అన్ని కమర్షియల్‌ వాహనాలపై 1.50 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు పరిధి మారుతుందని పేర్కొంది. 

ముడి సరుకుల ధరలు, ఇతర ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు చేపడుతున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 180 బిలియన్‌ డాలర్ల టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్, దేశంలో యుటిలిటీ వాహనాలు, పిక్‌అప్‌ వాహనాలు, ట్రక్కులు, బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement