
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మీ తన రాబోయే స్మార్ట్‌ఫో న్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. బ్యాటరీ విషయంలో ఇది "పెద్ద" డీల్ అంటూ ఊరిస్తోంది. దీని పేరును ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త రియల్‌మీ డివైస్ 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో టీజ్ చేసింది.
"ఇంత పెద్దది సరిపోతుందా? ఇదిగో రియల్‌మీ 1x000mAh - మరోసారి పరిమితులను చెరిపేస్తుంది. ఆగస్టు 27న అద్భుతం చూడండి' అంటూ రియల్‌మీ పోస్ట్ చేసింది. "అతిపెద్దది మరింత పెద్దదిగా మారింది. రియల్‌మీ మరోసారి పరిమితులను పునర్నిర్వచించనుంది. 320వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వరకు... తర్వాత ఏం జరగబోతోంది?" అని మరో ఎక్స్ పోస్ట్ లో పేర్కొంది.
అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో అధునాతన బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ ఉండొచ్చని తెలుస్తోంది. రియల్‌మీ రాబోయే డివైజ్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని దాటుతుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రియల్‌మీలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ జీటీ 7. చైనీస్ మోడల్లో ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,200 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంది. అదే ఇండియన్ రియల్‌మీ జీటీ 7 వెర్షన్‌లో అయితే 120వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
THE BIGGEST JUST GOT EVEN BIGGER. 🔋
realme Is Set To Redefine The Limits Once More.
From 320W Fast Charging To A Massive 1x000mAh Battery…
What’s Coming Next?
August 27 — Get Ready For The Next Power Revolution.
Know More: https://t.co/c8wHve6fZ2#FreeToBeReal… pic.twitter.com/SrctmwWzrg— realme (@realmeIndia) August 21, 2025