
హాంగ్జౌ: ఎయిర్ చైనా విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగాయి. హాంగ్జౌ నుంచి దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌కు బయలుదేరిన విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాకంపితులయ్యారు. ఓవర్‌హెడ్ బిన్ నుంచి మంటలు రాగా.. విమానం లోపలంతా పొగ వ్యాపించింది.
అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాన్ని షాంఘైకి మళ్లించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడిచింది. ఓ ప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Air China flight CA139 made emergency landing in Shanghai today after a lithium battery in overhead luggage self-ignited.
No injuries reported
That’s why Emirates has now restricted power bank charging onboard
pic.twitter.com/KNDVKpINKJ— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) October 18, 2025