ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం | Fire Broke Out In Dhaka International Airport | Sakshi
Sakshi News home page

ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Oct 18 2025 6:28 PM | Updated on Oct 18 2025 6:59 PM

Fire Broke Out In Dhaka International Airport

బంగ్లాదేశ్‌లోని ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా  ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో  ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి.  దాంతో  ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. 

ఢాకాలోని హజ్రాత్‌ షాహ్‌జలాల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం  గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో   పొగ దావానలంలా వ్యాపించింది.  కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను  ఉన్నపళంగా నిలిపివేశారు.  

అంతర్జాతీయ గూడ్స్‌ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్‌ నంబర్‌ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌లో  ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది.  ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి:

Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement