breaking news
Dhaka Airport
-
ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్‌లోని ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఢాకాలోని హజ్రాత్ షాహ్జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో పొగ దావానలంలా వ్యాపించింది. కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను ఉన్నపళంగా నిలిపివేశారు. అంతర్జాతీయ గూడ్స్ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్ నంబర్ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌లో ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq— Press Trust of India (@PTI_News) October 18, 2025ఇదీ చదవండి:Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు -
ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధానిలో గుర్తుతెలియని దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టించింది. రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒకరు మృతి చెందారు. ఢాకా అధికారుల కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని దుండగుడు ఆత్మాహుతి దాడికి సిద్ధమై ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చాడు. విమాశాశ్రయంలోని ఓ చెక్ పాయింట్ వద్ద భద్రతా బలగాలు ఓ అనుమానితుడిని గుర్తించాయి. దాదాపు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ దుండగుడు పోలీసుల చెక్ పాయింట్ సమీపంలో ఓ బాంబు అమర్చాడు. ఆ బాంబు పేల్చుకుని ఆ వ్యక్తి చనిపోయాడని రుహుల్ అమిన్ అనే అధికారి వెల్లడించారు. వారం రోజుల్లో ఈ ఎయిర్పోర్ట్ లో బాంబు దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల ఓ మిలిటెంట్ బైక్‌పై ఎయిర్‌పోర్టు చెక్ పాయింట్ సమీపానికి రాగానే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోయాడు. ఢాకాలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.