ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడి | Suicide attacker blows himself at Dhaka International Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడి

Mar 24 2017 9:49 PM | Updated on Nov 6 2018 7:53 PM

ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడి - Sakshi

ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడి

బంగ్లాదేశ్ రాజధానిలో గుర్తుతెలియని దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టించింది.

ఢాకా: బంగ్లాదేశ్ రాజధానిలో గుర్తుతెలియని దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టించింది. రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన  ఆత్మాహుతి దాడిలో ఒకరు మృతి చెందారు. ఢాకా అధికారుల కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని దుండగుడు ఆత్మాహుతి దాడికి సిద్ధమై ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చాడు. విమాశాశ్రయంలోని ఓ చెక్ పాయింట్ వద్ద భద్రతా బలగాలు ఓ అనుమానితుడిని గుర్తించాయి.

దాదాపు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ దుండగుడు పోలీసుల చెక్ పాయింట్ సమీపంలో ఓ బాంబు అమర్చాడు. ఆ బాంబు పేల్చుకుని ఆ వ్యక్తి చనిపోయాడని రుహుల్ అమిన్ అనే అధికారి వెల్లడించారు. వారం రోజుల్లో ఈ ఎయిర్‌పోర్ట్ లో బాంబు దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల ఓ మిలిటెంట్ బైక్‌పై ఎయిర్‌పోర్టు చెక్ పాయింట్ సమీపానికి రాగానే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోయాడు. ఢాకాలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement