ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం | Fire Breaks Out at Brahmaputra Apartments in Delhi MP Complex – Six Fire Engines on Spot | Sakshi
Sakshi News home page

ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం

Oct 18 2025 2:26 PM | Updated on Oct 18 2025 4:42 PM

Massive Fire Breaks Out At Mps Staff Quarters In Delhi

ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్‌కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్‌లోని ఈ అపార్ట్‌మెంట్‌.. పార్లమెంట్ హౌస్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.

బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్‌లో మూడు అంతస్తులు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఫోన్ కాల్ తర్వాత 40 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నట్లు తెలిసింది. ఆలస్యంగా రావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా బాణాసంచా కారణమని స్థానికులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫర్నిచర్ ఉంచడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అపార్ట్‌మెంట్‌ వాసులు అంటున్నారు. సీపీడబ్ల్యూడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అపార్ట్‌మెంట్‌ వాసుల ఆరోపిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement