
సాక్షి, ప్రకాశం: ప్రకాశం(Prakasam) జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని కలికివాయి బిట్రగుంటలో పొగాకు గోదాంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిరిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు.
వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో బెల్లం కోటయ్యకు చెందిన పొగాకు గోదాంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేనప్పటికీ భారీగా జరిగిన ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.