
Samsung Galaxy M17 5G: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ శుక్రవారం భారత్‌లో లాంచ్ అయింది. ఇది అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. రెండు కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ ఫోన్, ఓఐఎస్‌తో 50MP ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. M16 5G కంటే ఇది వేగవంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.
ధర & లాంచ్ ఆఫర్
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.13,999, రూ.15,499. లాంచ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు 4 జీబీ వేరియంట్‌ను రూ.11,999లకు 6 జీబీ వేరియంట్‌ను రూ.13,499 లకు, 8 జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
ప్రధాన ఫీచర్లు
» ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7
» డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్, 1,100 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్
» ప్రాసెసర్: ఎక్సినోస్ 1330 చిప్‌సెట్
» ర్యామ్ & స్టోరేజ్: 4GB/6GB/8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించవచ్చు)
» కెమెరా:
రియర్: 50MP (ఓఐఎస్) + 5MP (అల్ట్రా వైడ్) + 2MP (మాక్రో)
ఫ్రంట్: 13MP సెల్ఫీ కెమెరా (వాటర్‌డ్రాప్ నాచ్‌లో)
ఇతర ఫీచర్లు
» బ్యాటరీ: 5,000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్
» సెక్యూరిటీ & అప్డేట్స్: 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్, 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ హామీ
» ఏఐ ఫీచర్లు: సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని లైవ్, వాయిస్ మెయిల్, వాయిస్ ఫోకస్
» ఆన్-డివైస్ సెక్యూరిటీ: శాంసంగ్ నాక్స్ వాల్ట్, శాంసంగ్ వాలెట్
ఇదీ చదవండి: కొత్త ఫోన్ తీసుకొచ్చిన జియో.. ఇది ఉంటే ఫుల్ సేఫ్టీ!