
రిలయన్స్ జియో సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సులో వివిధ సేఫ్టీ ఫీచర్లతో కూడిన జియోభారత్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఫోన్ పర్యవేక్షణ, వినియోగ నిర్వహణ, కుటుంబ సభ్యులు, పిల్లలు, వృద్ధులకు సంబంధించిన హెల్త్ వంటి సేఫ్టీ-ఫస్ట్ ఫీచర్లను ఈ ఫోన్‌లో తీసుకొచ్చింది.
వినియోగదారులకు భద్రతతోపాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలా రూపొందించిన జియోభారత్ ఫోన్లను ఐఎంసీ సదస్సులో రిలయన్స్ ఆవిష్కరించింది. అంతేకాకుండా వైట్-లిస్టింగ్ ద్వారా అవాంఛిత కాల్స్ , కాలర్లను నివారించడంలో సేఫ్టీ షీల్డ్ సహాయపడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే కుటుంబ సభ్యుల వద్ద ఉన్న జియోఫోన్‌లో బ్యాటరీ , నెట్ వర్క్ లభ్యత స్థితిని రిమోట్ గా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఇక ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఏడు రోజుల వరకు ఉంటుందని జియో పేర్కొంది.

జియోభారత్ ఫోన్ సేఫ్టీ షీల్డ్ మరిన్ని ప్రయోజనాలను రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ వివరించారు. ఈ ఫోన్‌లు ముఖ్యంగా కుటుంబంలోని పిల్లలు, పెద్దవారి కోసం రూపొందించినట్లు చెప్పారు. ఈ ఫోన్‌లు వినియోగిస్తున్న తమ వారు ఎక్కడ ఉన్నారు.. వారి ఫోన్‌లు ఎక్కడ ఉన్నాయో మీరు పర్యవేక్షించగలుగుతారు. ఒకవేళ కనిపించక పోయినట్లయితే ఫోన్‌లోని అలారాన్ని మోగించవచ్చు.
జియోభారత్ ఫోన్‌లను జియో స్టోర్స్, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలుచ చేయవచ్చు. జియోభారత్ ఫోన్ల ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుంది.