jio phones
-
వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్ అప్డేట్..!
దీపావళికి విడుల కానున్న ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ కోసం దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌పై మరో సూపర్ అప్ డేట్ వచ్చింది. జియో ఫోన్లో భారతీయత ఉట్టిపడేలా 'ఆపరేటింగ్ సిస్టం'కు ట్రెడిషనల్ పేరు పెట్టి జియో అధినేత ముఖేష్ అంబానీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఫోన్లో ఫీచర్లు, ఓఎస్ గురించి జియో అధికారికంగా ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్‌కి ఎదురే లేదు. యాపిల్ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానం చెక్కు చెదరడం లేదు. ఆండ్రాయిడ్‌కి పోటీగా హువావే, శామ్సంగ్, వన్‌ప్లస్‌లు కొత్త ఓఎస్‌లు అభివృద్ధి చేసినా ఆండ్రాయిడ్ ముందు నిలవలేకపోయాయి. తాజాగా గూగుల్ అక్టోబర్ 4 సరికొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 12 రిలీజ్ చేసింది. దివాళీకి విడుదల కానున్న జియోలో ఈ లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు తొలిసారి ఆండ్రాయిడ్ 1.0 వెర్షన్ సెప్టెంబర్ 23,2008 లో విడుదలైంది. అలా నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లకు 31 రకాల పేర్లు ఉన్నాయి. వాటిలో స్నో కోన్, రెడ్ వెల్వెట్ కేక్,క్విన్స్ టార్ట్, ఓట్ మీల్ కుకీ ఇలా వెస్ట్రన్ పేర్లున్నాయి. కానీ మనదేశ సాంప్రదాయానికి అనుగుణంగా ఏ ఒక్క ఆండ్రాయి వెర్షన్లకు పేర్లు పెట్టలేదు. కానీ తొలిసారి జియో ఫోన్ నెక్ట్స్‌లో తొలిసారి ఓఎస్‌కు 'ప్రగతి ఓఎస్'గా నామకరణం చేశారు. జియో ఫోన్‌ను అందరూ వినియోగించి,ప్రగతి (ప్రొగ్రెస్) సాధించాలని ఉద్దేశంతో ప్రగతి పేరు పెట్టినట్లు జియో తెలిపింది. ఈ ఫోన్ కనెక్టివిటీ సమస్య లేకుండా ఉండేందుకు క్వాల్కమ్ ప్రాసెసర్, వాయిస్ అసిస్టెంట్స్, టాన్స్ లేట్, ఈజీ అండ్ స్మార్ట్ కెమెరా, ఆటోమెటిక్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్, జియో - గూగుల్ యాప్స్ ప్రీలోడెడ్ ఫీచర్లు ఉన్నాయి. చదవండి: జియో ఫోన్ సేల్స్ కోసం అదిరిపోయే బిజినెస్ మోడల్ -
రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్స్ ఇవే!
భారతదేశంలో వచ్చే నెల సెప్టెంబర్ 10న విడుదల కానున్న జియోఫోన్ నెక్ట్స్ ధర, ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ప్రపంచంలో ఇదే అత్యంత చౌకైన ఫోన్ కానున్నట్లు తెలిపారు. తాజాగా, ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను టిప్ స్టార్ యోగేష్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు ఇతను కూడా దృవీకరించాడు. యోగేష్ పేర్కొన్న ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ ఫీచర్స్(అంచనా): 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్ 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ 𝗝𝗶𝗼𝗣𝗵𝗼𝗻𝗲 𝗡𝗲𝘅𝘁 •5.5" HD display •4G VoLTE Dual SIM •2/3GB RAM •16/32GB storage eMMC 4.5 •Qualcomm Snapdragon 215 •Android 11 (Go Edition) •Rear camera: 13MP •Front camera: 8MP •2,500mAh battery Launch next month, estimated price ₹3,499 — 𓆩Yogesh𓆪 (@heyitsyogesh) August 17, 2021 -
జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త!
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ శుభవార్త చెప్పింది. ఇకపై జియో ఫోన్లలో వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఇకపై కైయోస్ ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్) మోబైల్ వినియోగదారులు కూడా వాయిస్ కాల్స్ మాట్లాడుకునేలా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్‌లోని వాయిస్ కాల్స్ అప్ డేట్ తో తాజా వెర్షన్ 2.2110.41 తో లభిస్తుంది. కొత్తగా తెచ్చిన ఈ ఫీచర్ ను కైయోస్ ఓఎస్ లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ తప్పని సరిగా ఉండాలని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న కైయోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్ట్ ఉన్న ఫోన్లలో ఈ నోటిఫికేషన్ చూపిస్తుంది. ఒకవేళ కైయోస్ ఓస్ వినియోగదారులు ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగదారులు తన కుటుంబసభ్యులతో, స్నేహితులతో మాట్లాడేందుకు గతంలోకంటే ఇప్పుడు వాట్సాప్ మీద ఆదారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులు వాట్సాప్ ను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా కైయోస్ ఓఎస్ లో వాట్సాప్ కాల్స్ ఫీచర్ ను ఎనేబుల్ చేసినట్లు వాట్సాప్ సీఓఓ మ్యాట్ ఐడెమా తెలిపారు. చదవండి : సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు -
జియో ఫోన్: వాలెంటైన్స్ డే గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్త అందించింది. ఇప్పటివరకు జియో ఫోన్లలో అందుబాటులోలేని ప్రముఖ యాప్ ఫేస్‌బుక్‌ను అందుబాటులోకి తేనుంది. ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రత్యేక ఫేస్బుక్ వెర్షన్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభించనుంది. ఫేస్బుక్ రేపటినుంచి (ఫిబ్రవరి 14) అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. యాప్‌స్టోర్ ద్వారా దీన్ని జియో డివైస్‌లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పరివర్తనా సాంకేతికతతో, ప్రపంచంలోనే అత్యంత సరసమైన జియో ఫోన్‌ను అందించామనీ, దీంతో ఫీచర్‌ఫోన్‌నుంచి భారతీయులు స్మార్ట్ఫోన్లకు మైగ్రేట్ అయినట్టు జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ వెల్లడించారు. ముందు వాగ్దానం చేసినట్టుగా ఫేస్బుక్ సహా ఇతర ప్రముఖ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. మరోవైపు జియోతో భాగస్వామ్యం ద్వారా లక్షలమంది యూజర్లకు ఉత్తమమైన ఫేస్బుక్ అనుభవాన్ని అందించడం సంతోషంగా ఉందని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో వరేలా పేర్కొన్నారు. జియోఫోన్ కర్సరు ఫంక్షన్‌కు అనుగుణంగా తాజా యాప్‌ను ఆప్టిమైజ్ చేసినట్టు చెప్పారు. ఈ కొత్త ఫేస్బుక్ వెర్షన్‌ను ప్రత్యేకంగా జియో కాయ్ ఆపరేటింగ్ సిస్టం కోసం రూపొందించారు. వెబ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా భారతదేశంలో 50 కోట్ల మంది జియో ఫోన్ యూజర్లకు ఫేస్బుక్ అందుబాటులోకి వస్తుంది. దీంట్లో పుష్ నోటిఫికేషన్లు, వీడియోలు సహా బయటి సమాచారానికి సంబంధిచిన లింక్స్‌కు మద్దతు ఇస్తుంది. -
జియో ఫోన్ల తయారీ నిలిపేయలేదు..
న్యూఢిల్లీ: రూ.1,500 జియో 4జీ ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను రిలయన్స్ జియో ఖండించింది. భారతదేశపు డిజిటల్ విజన్ సాకారానికి ఎల్లప్పుడూ చేయూతనందిస్తామని తెలిపింది. తొలి విడతలో 60 లక్షల జియో ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లను డిజిటల్ లైఫ్‌లోకి స్వాగతిస్తున్నామని పేర్కొంది. త్వరలోనే రెండో విడత జియో ఫోన్ బుకింగ్స్ తేదీని ప్రకటిస్తామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా జియో ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకురావడంపై కసరత్తు చేస్తోందని ఈ మధ్యే వార్తలు వెలువడ్డాయి. -
ఆదివారం నుంచి జియో ఫోన్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో రూ.1,500 విలువగల 4జీ ఫీచర్ ఫోన్ల డెలివరీని ఆదివారం నుంచి ప్రారంభించనుంది. సంస్థ దాదాపు 60 లక్షల ఫోన్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జియో ఫోన్ల ప్రి–బుకింగ్ ఆగస్ట్ 24న ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.500 ప్రారంభ డిపాజిట్‌తో కస్టమర్లు వీటికి బుకింగ్ చేసుకున్నారు. మిగిలిన మొత్తం ఫోన్ల డెలివరీ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు మూడేళ్ల తర్వాత ఫోన్‌ను వెనక్కు ఇవ్వడం ద్వారా ఈ పూర్తి మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. -
జియో ఫీచర్ ఫోన్ ఉచితం: అంబానీ