
న్యూఢిల్లీ: రూ.1,500 జియో 4జీ ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను రిలయన్స్ జియో ఖండించింది. భారతదేశపు డిజిటల్ విజన్ సాకారానికి ఎల్లప్పుడూ చేయూతనందిస్తామని తెలిపింది. తొలి విడతలో 60 లక్షల జియో ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లను డిజిటల్ లైఫ్‌లోకి స్వాగతిస్తున్నామని పేర్కొంది.
త్వరలోనే రెండో విడత జియో ఫోన్ బుకింగ్స్ తేదీని ప్రకటిస్తామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా జియో ఫీచర్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌ను తీసుకురావడంపై కసరత్తు చేస్తోందని ఈ మధ్యే వార్తలు వెలువడ్డాయి.