Jio Phone Next: వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్‌ అప్‌డేట్‌..!

Jio Phone Next Features Release Date Latest News - Sakshi

దీపావళికి విడుల కానున్న ప్రపంచంలో అత్యంత చవకైన  ఫోన్‌ జియో ఫోన్‌ నెక్ట్స్‌ కోసం దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌పై మరో సూపర్‌ అప్‌ డేట్‌ వచ్చింది. జియో ఫోన్‌లో భారతీయత ఉట్టిపడేలా 'ఆపరేటింగ్‌ సిస్టం'కు ట్రెడిషనల్‌ పేరు పెట్టి జియో అధినేత ముఖేష్‌ అంబానీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఫోన్‌లో ఫీచర్లు, ఓఎస్‌ గురించి జియో అధికారికంగా ప్రకటించింది.


స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో గూగుల్‌కి ఎదురే లేదు. యాపిల్‌ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నా గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ స్థానం చెక్కు చెదరడం లేదు. ఆండ్రాయిడ్‌కి పోటీగా హువావే, శామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌లు కొత్త ఓఎస్‌లు అభివృద్ధి చేసినా ఆండ్రాయిడ్‌ ముందు నిలవలేకపోయాయి. తాజాగా గూగుల్‌ అక్టోబర్‌ 4 సరికొత్త ఓఎస్‌ ఆండ్రాయిడ్‌ 12 రిలీజ్‌ చేసింది. దివాళీకి విడుదల కానున్న జియోలో ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు తొలిసారి ఆండ్రాయిడ్‌ 1.0 వెర్షన్‌ సెప్టెంబర్‌ 23,2008 లో విడుదలైంది. అలా  నాటి నుంచి ఇప్పటి  వరకు అన్ని ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లకు 31 రకాల పేర‍్లు ఉన్నాయి. వాటిలో స్నో కోన్‌, రెడ్ వెల్వెట్ కేక్,క్విన్స్ టార్ట్, ఓట్‌ మీల్‌ కుకీ ఇలా వెస్ట్రన్‌ పేర్లున్నాయి. కానీ మనదేశ సాంప్రదాయానికి అనుగుణంగా ఏ ఒక్క ఆండ్రాయి వెర్షన్‌లకు పేర్లు పెట్టలేదు. 


కానీ తొలిసారి జియో ఫోన్‌ నెక్ట్స్‌లో తొలిసారి ఓఎస్‌కు 'ప్రగతి ఓఎస్‌'గా నామకరణం చేశారు. జియో​ ఫోన్‌ను అందరూ వినియోగించి,ప్రగతి (ప్రొగ్రెస్‌) సాధించాలని ఉద్దేశంతో ప్రగతి పేరు పెట్టినట్లు జియో తెలిపింది. ఈ ఫోన్‌ కనెక్టివిటీ సమస్య లేకుండా ఉండేందుకు క్వాల్కమ్‌ ప్రాసెసర్‌, వాయిస్‌ అసిస్టెంట్స్‌, టాన్స్‌ లేట్‌, ఈజీ అండ్‌ స్మార్ట్‌ కెమెరా, ఆటోమెటిక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌, జియో - గూగుల్‌ యాప్స్‌ ప్రీలోడెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. 

చదవండి: జియో ఫోన్‌ సేల్స్‌ కోసం అదిరిపోయే బిజినెస్‌ మోడల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top