విడుదలకు ముందు ఆన్‌లైన్‌లో జియో ఫోన్‌ ఫీచర్స్ లీక్!

JioPhone Next specifications have surfaced online ahead of the launch - Sakshi

విడుదలకు ముందే బడ్జెట్‌ 'జియోనెక్ట్స్‌' ఫోన్‌ ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇప్పటికే జియో ఫోన్‌ వినాయక చవితికి విడుదల రావాల్సి ఉండగా.. సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే, త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్‌ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్‌ కాంపోనెట్స్‌ ధరల కారణంగా.. గతంలో అనౌన్స్‌ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్‌ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. దీపావళికి రోజున (నవంబర్ 4న) జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను విడుదల చేస్తామని రిలయన్స్ జియో ధృవీకరించింది. 

జియో ఫోన్‌ ఫీచర్స్(అంచనా)

  • 5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్
  • అడ్రినో 306 జీపీయు
  • 2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా
  • 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ 
  • ఆండ్రాయిడ్ గో ఓఎస్ 
  • ధర - రూ.3,499

(చదవండి:  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top