శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్‌లోనే హై ఎండ్‌ ఫీచర్స్‌ | Samsung Galaxy F36 5G Launched in India With AI Features Triple Rear Cameras | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్‌లోనే హై ఎండ్‌ ఫీచర్స్‌

Jul 19 2025 9:34 PM | Updated on Jul 19 2025 9:39 PM

Samsung Galaxy F36 5G Launched in India With AI Features Triple Rear Cameras

దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్దిగ్గజం శాంసంగ్నుండి కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ విడుదలైంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ స్మార్ట్ఫోన్ భారత్లో లాంచ్ అయింది. బడ్జెట్ధర రూ .20,000 లోపే ఇది లభ్యమవుతుంది. ఎక్సినోస్ 1380 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తోపాటు గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్ సహా ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ ధర

గెలాక్సీ ఎఫ్36 5జీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. శాంసంగ్ కొత్త ఎఫ్-సిరీస్ స్మార్ట్ఫోన్ జూలై 29 నుంచి ఫ్లిప్కార్ట్, శాంసంగ్అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కోరల్ రెడ్, లక్స్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మూడు కలర్ వేస్ లో లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్ ఉంది.

స్పెసిఫికేషన్లు

  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 36 5జీ డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్, ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

  • సెల్ఫీ కెమెరా కోసం డిస్ ప్లే పైభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1380 ఎస్ వోసీ, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్ మెంట్ కోసం వేపర్ ఛాంబర్ కూడా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

  • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4కే వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేసే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఎఫ్/ 1.8 సెన్సార్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది 4కె వీడియో రికార్డింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

  • శాంసంగ్ లేటెస్ట్ ఎఫ్ సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుది. ఆరు ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

  • గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, ఏఐ ఎడిట్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.

  • గెలాక్సీ ఎఫ్36 5జీలో 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ + గ్లోనాస్ను అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement