గుంటూరులో అంబరాన్నంటిన భోగి సంబురాలు | Bhogi 2026 Celebrations: Ambati Dance Celebrations At Guntur Video | Sakshi
Sakshi News home page

గుంటూరులో అంబరాన్నంటిన భోగి సంబురాలు

Jan 14 2026 7:23 AM | Updated on Jan 14 2026 7:27 AM

Bhogi 2026 Celebrations: Ambati Dance Celebrations At Guntur Video

సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో  భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన.. తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. 

నేను ఎక్కడుంటే.. అక్కడే సంబురాలు చేయాలి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నా. సంక్రాంతి సంబురాలు చేస్తాను.. డ్యాన్సులు చేస్తాను కాబట్టి సంబురాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారు. అలా మాట్లాడేవాళ్లు ఆ పని చేయలేరు. ఎందుకంటే నేను పొలిటీషియన్‌ను.. వాళ్లు కాదు కాబట్టి’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అంబటి నేరుగా చురకలంటించారు.

మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్‌ కాలేజీలు కొనసాగాలి. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలడం ఖాయం అని అంబటి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement