ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు

Published Sun, Jan 15 2023 6:38 AM

PM Narendra Modi greets people on Uttarayan, Bhogi - Sakshi

న్యూఢిల్లీ: భోగి, ఉత్తరాయణ పర్వదినాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలకు ఉత్తరాయణ, భోగి శుభాకాంక్షలు.

ఈ పండుగ రోజులు అందరికీ సంతోషాన్ని, శుభాలను కలుగజేయాలని, జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను’అని ఆయన ట్వీట్లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భోగి పండుగను, ఉత్తరాయణం సందర్భంగా గుజరాత్‌ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement