
ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. భోగి వేడుకల్లో..
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారక ముందు నుంచే భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో సంబరాలు ప్రారంభించుకున్నారు ప్రజలు. ఇక..
జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. తన ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు చేశారాయన. ఆపై గిరిజనులతో కలిసి స్టెప్పులు వేసి ఆటపాటల్లో పాల్గొన్నారాయన. వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. అక్కడున్న వాళ్లను హుషారెత్తించారు మంత్రి అంబటి.