సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని అన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు.
మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026


