ప్రయాణం.. పెను భారం
ప్రయాణం.. పెను భారం బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026 పట్నంబజారు: గుంటూరు రీజియన్ పరిధిలో సుమారు 412 బస్సులు ఉండగా, వాటిలో 250 నుంచి 300 బస్సుల వరకు సీ్త్ర శక్తి పథకం కింద మహిళలే అధికంగా వినియోగిస్తున్నారు. మిగిలిగిన బస్సులను కూడా హైదరాబాద్, చైన్నె, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంతాలకు పంపించలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు సంక్రాంతికి సంబంధించి అసలు ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారనేదే ప్రకటించలేదు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంక్రాంతి రద్దీ దెబ్బకు ప్రయాణికులకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఒకవైపు మహిళలకు ప్రయాణ సౌలభ్యం పెరిగినా, మరోవైపు ఆర్టీసీపై భారం గణనీయంగా పెరిగింది. ఫలితంగా సాధారణ ప్రయాణికులు, ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు.
అధికారులకు సవాల్
సంక్రాంతి సమయంలో సాధారణ రోజులతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. గుంటూరు రీజియన్ పరిధిలో మొత్తం నిత్యం లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో 60 శాతం మహిళలేనని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యవసాయ కూలీలు, కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారు – అందరూ బస్సులపై ఆధారపడతారు. సాధారణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ రద్దీని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. ఈసారి బస్సుల సంఖ్య, అవసరానికి తగిన స్థాయిలో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్ స్టేషనులో రోజంతా జనమే కనిపిస్తున్నారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సులు వచ్చిన వెంటనే కిటకిటలాడిపోతున్నాయి. నిల్చుని ప్రయాణించాల్సి వస్తోంది.
దూరప్రాంతాలకు బస్సుల కొరత దూరప్రాంతాలకు సరిపడా బస్సులు కేటాయించలేకపోవడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు వెళ్లే బస్సులకు డిమాండ్ ఉంది. అందుకు తగిన సంఖ్యలో సర్వీసులు అందుబాటులో లేవు. ఒకవైపు నగరాలు, గ్రామాల మధ్య తక్కువ దూరం కలిగిన రూట్లకు మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో అక్కడే బస్సులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దూరప్రాంతాల సర్వీసులు తగ్గిపోయాయి. కొన్ని చోట్ల రోజుకు ఉండే బస్సుల సంఖ్యను సగానికి తగ్గించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాహనాల కొరత, ఇప్పటికే చాలావరకు బస్సులు మరమ్మతుల కోసం డిపోలలో నిలిచిపోవడం వలన ఈ దుస్థితి నెలకొంది. కొత్త బస్సుల కొనుగోలు పరిమితంగా ఉండటంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. సిబ్బంది సమస్య కూడా ఆర్‌టీసీని వెంటాడుతోంది.
న్యూస్‌రీల్
పథకంతో తీవ్ర ప్రభావం
సంక్రాంతి అంటే చాలు గ్రామాలకు వెళ్లే వారే ఎక్కువ. ఉద్యోగం, ఉపాధి, విద్య తదితర కారణాలతో నగరాలు, పట్టణాల్లో ఉంటున్న లక్షల మంది పండుగకు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఈ సమయంలో ఏపీఎస్‌ఆర్‌టీసీపై ఒత్తిడి భారీగా పెరిగింది. ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణాలు మరింత భారంగా మారాయి. బస్సులు సరిపోక, రద్దీ పెరిగి దూరప్రాంతాలకు సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సీ్త్రశక్తి, బస్సుల కొరత
మధ్య నలిగిపోతున్న ప్రయాణికులు
దూరప్రాంతాల ప్రజలకు
అందుబాటులో లేని బస్సులు
కనీసం సీటు దొరక్క పురుషులకు
తప్పని అగచాట్లు
ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తే
అడ్డగోలు చార్జీలతో జేబుకు చిల్లు
1/1
ప్రయాణం.. పెను భారం