నిదానంపాటి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 39 లక్షలు
దుర్గి: అడిగొప్పలలోని శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ. 39,46,887 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సైదమ్మ బాయి తెలిపారు. 95 రోజులపాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపును మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కారంపూడి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రసీదును తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: కృష్ణా నదిలో స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన పల్లెగుంట సద్గుణ్ (22) తన ఇద్దరు స్నేహితులతో కలసి ద్విచక్రవాహనంపై మంగళవారం అమరావతి మండల పరిధిలోని దిడుగు ప్రాంతానికి చేరుకున్నారు. దిడుగు అవతల ఒడ్డున స్నానానికి కృష్ణా నదిలో దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ సద్గుణ్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఏటూరు, దిడుగు గ్రామస్తులు నదిలో అతడు గల్లంతైన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. యువకుని ఆచూకీ కోసం నదిలో గాలిస్తున్నారు.
నిదానంపాటి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 39 లక్షలు
నిదానంపాటి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 39 లక్షలు


