మహిళా వీఆర్‌ఓను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు
మేడికొండూరు: మేడికొండూరు మండలం కొరప్రాడు గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న మహిళను అసభ్య పదజాలంతో దూషించిన కొరప్రాడు గ్రామానికి చెందిన మద్దూ రామకోటిపై సీఐ నాగూర్ మీరా సాహెబ్ మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు.. రామకోటి నూతన పాస్ పుస్తకం కోసం వెళ్లి వీఆర్వోను కలువగా ఆమె మీ పొలం కోర్టు కేసులో ఉందని, అర్జీ పెట్టుకుంటే ఓకే చేస్తామని చెప్పింది. కోపోద్రికుడైన రామకోటి మహిళా వీఆర్వోను అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడాడు. రామకోటి ప్రవర్తనకు భయపడిన మహిళా వీఆర్వో మేడికొండూరు పోలీసులను ఆశ్రయించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళా వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కలిగించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగూర్ మీరా సాహెబ్ హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేశాం: మంత్రి నాదెండ్ల
తెనాలి అర్బన్: ధాన్యం కొనుగోలు వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41.27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రూ.10 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. రైతులందరూ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పశ్చిమ బ్యాంక్ కెనాల్‌లోకి
దూసుకెళ్లిన కారు
భట్టిప్రోలు: పెనుమూడి–వెల్లటూరు రహదారి మార్గం0లో పెదపులివర్రు పక్కనే ఉన్న పశ్చిమ బ్యాంక్ కెనాల్‌లోకి కారు దూసుకుపోయింది. కారులో పెదపులివర్రుకు చెందిన తండ్రి, కుమార్తెలు ప్రయాణం చేస్తున్నారు. కారు ప్రమాదవశాత్తూ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం మేరకు 108 వాహనం వారిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలవడంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేశారు.
మహిళా వీఆర్‌ఓను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు
మహిళా వీఆర్‌ఓను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు


