'ఇక్కడ నన్ను దొబ్బెస్తున్నారండి'.. చిరంజీవి సాంగ్‌పై బుల్లిరాజు అప్‌డేట్! | Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu: ‘Meesala Pilla’ Song on Oct 13 | Sakshi
Sakshi News home page

Mana Shankara VaraPrasad Garu: 'ఇక్కడ నన్ను దొబ్బెస్తున్నారండి'.. చిరంజీవి సాంగ్‌పై బుల్లిరాజు అప్‌డేట్!

Oct 10 2025 6:04 PM | Updated on Oct 10 2025 6:18 PM

Chiranjeevi Mana Shankara VaraPrasad Garu Movie song update

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ చిత్రం  మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్ మరో హిట్‌కు రెడీ అయిపోయారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరా కానుకగా సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

అయితే ప్రోమో రిలీజ్ తర్వాత మీసాల పిల్ల ఫుల్ సాంగ్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ‍అలరించిన బుల్లిరాజు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి అలరించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అనిల్ రావిపూడితో బుల్లిరాజు చేసిన కామెడీ నవ్వులు తెప్పిస్తోంది. మీసాల పిల్ల ఫుల్ సాంగ్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నారని అందరూ నన్ను దొబ్బేస్తున్నారండి అంటూ బుల్లి రాజు భీమ్స్‌ సిసిరోలియోను అడిగాడు. వెళ్లి డైరెక్ట్‌గా డైరెక్టర్‌ను అడుగు అంటూ బుల్లిరాజు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి- బుల్లిరాజు మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.

ఈ చిత్రంలోని మీసాల పిల్ల లిరికల్ వీడియో ఫుల్ సాంగ్‌ అక్టోబర్‌ 13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియే సంగీతమందించారు. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్‌ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement