సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్‌లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్‌లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది.
పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్‌స్టాప్‌గా షూట్ చేసినా, రిలీజ్‌కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్‌కు పెద్ది రిలీజ్ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్‌లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది.
దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్‌లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్‌ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్‌లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్‌లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో భారీ సినిమాలతో హాట్‌గా మారనుంది.


