సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 10 స్పెషల్‌ ట్రైన్స్‌ | Sankranti Rush: 10 Special Trains Between Hyderabad And Vijayawada | Sakshi
Sakshi News home page

సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్‌ ట్రైన్స్‌

Jan 10 2026 3:20 PM | Updated on Jan 10 2026 3:48 PM

Sankranti Rush: 10 Special Trains Between Hyderabad And Vijayawada

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండగ నేపథ్యంలో రైళ్లన్నీ ఫుల్‌ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్‌ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగకు ముందు, తర్వాత రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.

ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.  ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రైళ్లలో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.

కాగా, తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్‌ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ మీదుగా  ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. 

హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్‌ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్‌లలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement