breaking news
Lord Ganesha
-
63 ఏళ్లుగా గణపతి నవరాత్రోత్సవాలు
యాదగిరిగుట్టలోని హనుమాన్ వీధిలో 1962కు ముందు నుంచే గణేష్ ఉత్సవాలు : యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్‌కు వెళ్లే దారిలో వైకుంఠద్వారం సమీపంలో ఉన్న హనుమాన్ వీధిలో కాలనీవాసులు 63ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కాలనీలో ఉండే ప్రజలంతా కమిటీ ఏర్పాటు చేసుకొని నవరాత్రులను వైభవంగా జరిపిస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నారు. కాలనీ అంతా ఏకమై.. యాదగిరిగుట్ట పట్టణంలోని హనుమాన్ వీధిలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద మొదట్లో ఐదారు కుటుంబాలు మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించేవారు. అప్పట్లో సుమారు 3 ఫీట్ల వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు యాదగిరిగుట్ట ఆలయ అర్చకులతో పూజలు నిర్వహించేవారు. ప్రస్తుతం కాలనీ అంతా ఏకమై ఒకే చోట మండపాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమాప్రత్యేక కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాంనా చిన్ననాటి నుంచే హనుమాన్ ఆలయం వద్ద వినాయక మండపం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మా కాలనీ ప్రజలంతా కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాం. మా పెద్దలు ఏ విధంగానైతే పూజల బాధ్యత మా పై పెట్టారో.. అలాగే మా పిల్లలకు నేర్పిస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, నిర్వాహకుడుచదవండి: Vinayaka Chavithi 2025: గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన తీపి వంటకాలు -
వినాయక చవితి పూజకుపయోగించే పత్రి పేర్లు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసా?
-
గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన తీపి వంటకాలు
ఆది దంపతులకు మానసపుత్రుడు, ఓంకార స్వరూపుడు, విఘ్నాలను శమింపజేసే విఘ్నేశ్వరుడు, సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వదేవతా లక్షణసమన్వితుడు, స్వల్పకాలంలో ముక్తినిచ్చే మోక్షప్రదాత–మన గణపయ్య. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిపూజ తప్పనిసరి. తలచిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాలి.దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ఆరంభంలో ఈ జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే. అందుకే ఆయన్ని వేదం ‘‘జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం’’ అని స్తుతించింది. జపహోమాది క్రియలలో గణపతిపూజే ప్రథమ కర్తవ్యం.. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా’’ అనే ప్రార్థన అందుకే. ఇవాల్టి టిప్ ఆఫ్ దిడే లో భాగంగా విఘ్ననాయకుడికి ఎంతోప్రీతి పాత్రమైన వంటకాల గురించి తెలుసుకుందాం. రవ్వలడ్డుకావలసినవి : బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, ఏలకుల పొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు.తయారీ: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి పాకంలో కలుపుకుంటే తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ.చిట్టి ముత్యాల లడ్డుకావలసిన పదార్థాలు : శనగపిండి – 2 కప్పులు, యాలకల పొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – 2 1/2 కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు, రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంతతయారీ: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని ΄ాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండితీపి ఉండ్రాళ్ళుకావలసినవి : బియ్యంపిండి : 1 కప్పు, నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలువంట సోడా : చిటికెడు, ఉప్పు : చిటికెడుఉండ్రాళ్ళలో నింపడానికి పచ్చి కొబ్బరి కోరు : 1 కప్పు, కొబ్బరి పొడి : 1/2 కప్పు, వేయించిన గసాలు : 1 గరిటెడు, యాలకుల పొడి : 1/2 చెంచాతయారుచేసే విధానం : కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ఉప్పు, నెయ్యి వేసి మరి గిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపు తుండాలి. తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి తగు మాత్రం తీసుకుని చేతిలో వెడల్పుగా చేసుకుని మధ్యలో కొబ్బరి ΄ాకాన్ని ఉంచి మూసివేసి, గుండ్రంగా చుట్టాలి. లేదా మీకిష్టమైన ఆకృతుల్లో చేసి వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి.మోదక్లడ్డుకావలసినవి: గోధుమపిండి – అరకప్పు, బొంబాయి రవ్వ–1 కప్పు, పంచదార – 1 కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు, నీళ్ళు – 2 టీ స్పూన్లు, జీడిపప్పు – గుప్పెడు, కిస్మిస్ – గుప్పెడు, ఏలకుల΄పొడి – అర టీ స్పూనుతయారి: పంచదారలో నీళ్ళు కలిపి మధ్యస్థంగా పాకం పట్టుకోవాలి. గోధుమపిండి, బొంబాయిరవ్వలో తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నెయ్యివేడిచేసి బూందీ ప్లేట్లో గోధుమపిండి మిశ్రమాన్ని పోసి బూందీ చేసుకోవాలి. నెయ్యివడకట్టి బూందీని పాకంలో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ని నెయ్యిలో వేయించి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. యాలకుల΄÷డి కలిపి కావలసిన సైజుల్లో లడ్డు కట్టుకోవాలి.రవ్వ పూర్ణాలుకావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ – 2 కప్పులు, యాలకల పొడి – 1 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పులు, పంచదార – 2 1/2 కప్పులు, నెయ్యి – 1/2 కప్పు, మైదాపిండి – 1 1/2 కప్పు, బియ్యంపిండి – 1/4 కప్పుతయారు చేసే విధానం : బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార యాలకలపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి కొద్దిగా నీరు΄ోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి. -
గణపతి బప్పా 'మోరియా' వెనుక కథలేంటో తెలుసా?
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలకు సన్నద్ధమవుతోంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా సంబరమే. తొమ్మిరోజుల పాటు గణేష్మంటపాల్లో ఊరా, వాడా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు మారు మోగుతాయి. భజనలు కీర్తనల, భక్తిగీతాలతోగణనాయకుడ్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. విజయాలనీయవయ్యా విఘ్నరాజా అని వేడుకొంటారు.అయితే గణపతి బప్పా మోరియా అనే నినాదం ఎలా వచ్చిందో తెలుసా.అయితే ఈ నినాదంలో మోరియా అనే పదం నినాదంలా ఎలా మారింది. అసలు దీనికి అర్ధం ఏంటి.. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా మోరియా.. మంగల్ మూర్తి మోరియా అనే నినాదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారంటే..15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. మహారాష్ట్రాలోని పుణెకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు.మోరియా గోసావి 117 సంవత్సరాల వయస్సు వరకు క్రమం తప్పకుండా మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాడు. అయితే వయోభారం కారణంగా ఆయన ఆలయానికి వెళ్లలేకపోకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారట.అయితే మోరియా నిద్రపోతున్న సమయంలో స్వయంగా ఈ విఘ్న నాయకుడు కలలో కనిపించి.. అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని..దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. అలా మోరియా నదికి వెళ్లగా. అక్కడొక వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయంలో గ్రామంలో అందరికీ తెలిసింది. దీంతో సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపించిన మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అంటే.. గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. అలా ’గణపతి బప్పా మోరియా’ అనే నినాదం కొనసాగుతోందని చెబుతారు. తనివితీరా గణపతి బప్పా మోరియా అని మొక్కితే సర్వ విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం.పురాణ గాథమహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది. పుణెకు 79 కిలోమీటర్ల దూరంలో బారమతీ తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర. పిల్లలు లేనందువల్ల శౌనక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది. సూర్యుడిని మించిన వేడి పిల్లవాడు జన్మించడంతో అతడిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో దొరికిన కారణంగా అతడు సముద్ర లేదా సింధురాసురుడగా ప్రసిద్ధికెక్కాడు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం చేసిన తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదించాడనీ, దీంతో సింధుకు మృత్యుభయం ఉండదని చెబుతారు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడట. ఈ అహంకారంతో దేవతలపైనా, కైలాసం, వైకుంఠంపైనా దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహా విష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసురుడు ప్రకటించాడు. దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై.. తాను పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని అంతమొందిస్తానని వారితో చెప్పాడట. పన్నెండేండ్లు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి కొడుకుగాపుట్టాడట. ఒకసారి సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. ‘మోర్’ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకొని వచ్చి సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని.. అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు కొలుస్తుంటారు. అలా క్రమంగా ‘గణపతి బప్పా మోరియా’గా ప్రసిద్ధికెక్కింది. ఈ కథను చెప్పేవారికి, విన్నవారికి సమస్త కోరికలు ఫలిస్తాయనిధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుందని పండితుల ఉవాచ.నోట్ : అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రం. ఇది భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు మీద ఆధారపడి ఉంటాయనేది గమనించాలి. -
వరాలిచ్చే కురుడుమలై వినాయక
కోలారు: జిల్లాలోని ముళబాగిలు తాలూకాలోని కురుడుమలై గ్రామంలో వెలసిన వినాయకుడు భక్తులకు కోరిన వరాలను అందిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాలలో మొదటిదిగా గుర్తింపు పొందిన కురుడుమలై వినాయకుడు పురాణ ఇతిహాసం కలిగి ఉన్నాడు. 18 అడుగుల ఎత్తు కలిగి సాలిగ్రామ శిలతో తయారు చేసిన ఈ వినాయక విగ్రహాన్ని కృతయుగంలో త్రిమూర్తులు స్థాపించారని ప్రతీతి. త్రిమూర్తులు కలిసిన ప్రదేశం కాబట్టి దీనిని తొలుత కూటాద్రి అని, కాలక్రమంలో కూడుమలై అని, అనంతరం కురుడుమలైగా మారిందని పురాణ ఇతిహాసాల్లో ఉంది. రామాయణంలో రాముడు రావణ సంహారానికి ముందు కురుడుమలై వినాయకుడిని దర్శించి పూజలు చేసిన అనంతరం యుద్ధానికి వెళ్లాడని రామాయణంలో చెప్పారు. పూజిస్తే ఇక విజయమే.. ద్వాపర యుగంలో శమంతకమణిని అపహరించినట్లు తనపై వచ్చిన అపవాదును తొలగించుకోడానికి శ్రీకృష్ణుడు కురుడుమలై వినాయకుడిని పూజించాడని చెప్పారు. అదేవిధంగా పంచపాండవులు, అర్జునుడు ఈ వినాయకుడిని పూజించి యుద్ధాలకు వెళ్లి విజయాలు సాధించారనే ప్రతీతి ఉంది. ఆ నమ్మకంతోనే నేటి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లే ముందు కురుడుమలై వినాయకుడికి పూజలు చేసి అనంతరం ప్రచారం చేస్తే విజయం తప్పకుండా సిద్ధిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. సర్పదోషాలు కలిగిన వారు ఇక్కడ పూజలు చేస్తే దోష నివారణ అవుతుందనే నమ్మకం ఉంది. అదేవిధంగా కలియుగంలో శ్రీకృష్ణదేవరాయలు వినాయకుడికి పూజలు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారని చరిత్ర చెబుతోంది. అమ్మవారి ముందు వేడుకుంటే క్షమే.. అక్కడే క్షమదాంబ అమ్మవారి ఆలయం ఉంది. ప్రపంచంలోనే ఈ పేరు కలిగిన అమ్మవారి ఆలయం లేదని ప్రతీతి. తెలియక చేసిన తప్పులను అమ్మవారి ముందు వేడుకుంటే క్షమిస్తుందనే నమ్మకం ఇక్కడ ఉంది. పూర్వం కౌండిన్య మహర్షి దగ్గరలో ఉన్న పర్వతంపై తపస్సు చేశారని, అందుకే దానికి కౌండిన్య క్షేత్రమని పేరు వచ్చిందంటారు. కౌండిన్య నది ఇక్కడే పుట్టి పాలార్ నదిలో కలుస్తుంది. కరుడుమలై క్షేత్రంలో భక్తుల కోసం జిల్లా యంత్రాంగం సరైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం యాత్రి నివాస్‌ను నిర్మించింది. దేవాలయంలో ప్రధాన అర్చకులు శంకర్ దీక్షితులు, విశ్వనాథ దీక్షితులు నిత్యం పూజాధికాలను నిర్వహిస్తుంటారు. ఇదీ చదవండి: Vithika sheru బొజ్జ గణపయ్య మేకింగ్ వీడియో వైరల్ఐదు రోజుల పాటు విశేష పూజలు ప్రతియేటా గౌరీ పండుగ నుంచి మొదలుకుని వినాయక చవితి వరకు ఐదు రోజుల పాటు దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. వినాయక చవితి రోజున పంచామృతాభిషేకం మొదలుకుని ప్రత్యేక పూజలను, సాయంత్రం కళ్యాణోత్సవం నెరవేరుస్తారు. పండుగ మరుసటి రోజున స్వామి బ్రహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. షష్టి రోజున వసంతోత్సవం, సప్తమి పల్లకీ ఉత్సవం, ఐదవ రోజు అష్టమి శయనోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. కురుడుమలై గ్రామంలోనే చోళుల కాలంలో నిర్మించిన సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. కురుడుమలైకి ఎలా వెళ్లాలి? అత్యంత పురాణ ఇతిహాసం కలిగిన కురుడుమలై వినాయకుడి ఆలయం ముళబాగిలు తాలూకా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముళబాగిలు నుంచి ప్రతి అరగంటకు ఓ బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి వచ్చే వారు కోలారు మీదుగా ముళబాగిలు వెళ్లి అక్కడి నుంచి కురుడుమలై వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి వస్తే తిరుపతి–బెంగళూరు మార్గమధ్యంలో ముళబాగిలులో దిగి కురుడుమలైకి వెళ్లాల్సి ఉంటుంది. -
భక్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రసాదం మాత్రమే : కర్ణాటక నిర్ణయంపై వివాదం
కర్ణాటక ప్రభుత్వం భక్తులకు నాణ్యమైన 'ప్రసాదం' అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్ మండపాల వద్ద 'ఎఫ్ఎస్ఎస్ఏఐ-ధృవీకరించిన ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సరికొత్త దుమారం రేగింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయమని బీజేపీ అభివర్ణించింది. అయితే, గణేష్ చతుర్థి పండుగ సీజన్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. గణేష ఉత్సవ నిర్వాహకులకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే గణేష్ పందిళ్లలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. పందిళ్లలోఅందించే ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అంతేకాదు అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. అనుమతులు తప్పనిసరిబెంగళూరులోని గణేశ మంటప నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు, నగర పాలక సంస్థ, విద్యుత్ లాంటి స్థానిక అధికారుల అనుమతులను పొందాలి. నిర్వాహకులు పాండల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిర్దిష్ట పర్యావరణ నిబంధనలను కూడా పాటించాలి. తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర భద్రతా చర్యల్లో భాగంగా వేదిక వద్ద అత్యవసర సంప్రదింపు నంబర్లను ప్రదర్శించాలి.మరోవైపుగణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ కర్నాటక హైకోర్టు, అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో బుధవారం హుబ్బళ్లి-ధార్వాడ్‌లోని ఈద్గా మైదాన్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
పండుగ కోసం రవ్వ పూర్ణాలు
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ – 2 కప్పులు ఏలకులపొడి – 1 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పు పంచదార – రెండున్నర కప్పులు, నెయ్యి – 1/2 కప్పు మైదాపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యప్పిండి – 1/4 కప్పు తయారు చేసే విధానం: బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార ఏలకులపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోవాలి. (చదవండి: వినాయకుని వ్రత కల్పం... చేసుకోవలసిన విధి) -
వినాయకుని కోసం మంగళహారతి పాట
శీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘ సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి " జయ ‘‘ పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘ కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘ అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘ పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘ బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు " జయ ‘‘ పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘ -
Ganesh Chaturthi 2022: వినాయకుడి 8 అవతారాలు.. వాటి చరిత్ర ఇదే
వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది.వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం. వక్రతుండుడు పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఏకదంతుడు చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ç్ఛౌలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. మహోదరుడు శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారుపడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడి రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబో దరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. గజాననుడు కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు. లంబోదరుడు దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు.క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం,శోకం అనేసంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. వికటుడు పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్నిఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది. విఘ్నరాజు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విç్ఛ్నౌురాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విç్ఛ్నౌూలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి. ధూమ్రవర్ణుడు అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం. -
గజముఖాసుర వధ
వజ్రదంతుడిగా పేరుమోసిన మూషికాసురుడు వినాయకుడి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. వినాయకుడు తోక పట్టుకుని విసిరితే పడ్డ పాటుకు ఒళ్లునొప్పులు తీరక ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో నారదుడు కైలాసం నుంచి నేరుగా మూషికాసురుడి దగ్గరకు వచ్చాడు. మూలుగుతూనే నారదుడికి ఉచితాసనాన్ని చూపించాడు మూషికాసురుడు. నారదుడు సుఖాసీనుడై, ‘వజ్రదంతా! నిన్ను దారుణంగా పరాభవించిన వినాయకుడు గణాధిపతిగా వర్ధిల్లుతున్నాడు మరి...’ అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. పుండు మీద కారం చల్లినట్లయింది వజ్రదంతుడికి. ‘ఇప్పుడేం చెయ్యమంటావు నారదా?’ ఉక్రోషంగా అడిగాడు.‘వరాల దేవుడు మా తండ్రి బ్రహ్మదేవుడు ఉండనే ఉన్నాడు కదా! ఆయన కోసం తపస్సు చెయ్యి. ప్రతీకారం సాధించు’ అని చెప్పి, చల్లగా అక్కడి నుంచి నారాయణ నామస్మరణ చేస్తూ నిష్క్రమించాడు. భార్య ధవళ ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా, ఉన్నపళాన బయలుదేరాడు వజ్రదంతుడు. ఒక కీకారణ్యంలోకి చేరుకుని ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. వజ్రదంతుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు. ‘విఘ్నానికి రూపం కల్పించి, నా ఆజ్ఞానువర్తిగా చెయ్యి’ అడిగాడు వజ్రదంతుడు.‘తథాస్తు’ అన్నాడు బ్రహ్మదేవుడు. విఘ్నాన్ని ఆవాహన చేసి, వజ్రదంతుడి ముందు నిలిపాడు. అతడికేమీ కనిపించలేదు. బ్రహ్మ అతడికి సూక్ష్మదర్శన దృష్టిని అనుగ్రహించాడు. అప్పుడు అతిచిన్న నలుసు రూపంలో ఉన్న విఘ్నాన్ని చూడగలిగాడు వజ్రదంతుడు. నల్లని ఆ నలుసును చూసి, ‘ఈ నలుసును నేనేం చేసుకోను?’ అని ఆశ్చర్యంగా బ్రహ్మను అడిగాడు. ‘విఘ్నబీజం కంటికి కనిపించదు. ఇది కామరూపి. ఏ రూపమైనా ధరించగలదు. ఎంతటి అనర్థాన్నయినా సృష్టించి, లోకాలను అల్లకల్లోలం చేయగలదు. దీన్ని ఏం చేసుకుంటావో చేసుకో!’ అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమైపోయాడు. మూషికాసురుడు విఘ్నంతో ‘నువ్వు మహా గజముఖాసుర రూపం దాల్చి వెళ్లి వినాయకుణ్ణి నాశనం చెయ్యి’ అని ఆజ్ఞాపించాడు. అప్పుడే వినాయకుడు కైలాసం నుంచి తాను పుట్టిపెరిగిన విశ్వకర్మ నిర్మించిన భవంతికి చేరుకున్నాడు. అక్కడ సింహద్వారం ఎదుట చంద్రశిలా వేదికపై తీరికగా కూర్చుని, ప్రశాంతంగా పరిసరాలను తిలకిస్తూ సేదదీరుతున్నాడు. అలాంటి సమయంలో ‘వినాయకుడెక్కడ?’ అంటూ భీకర గర్జన వినిపించింది. మహా గజముఖాసుర రూపంలో విఘ్నం వినాయకుడి ఎదుట వాలింది. ‘నువ్వు గజముఖుడివైతే, నేను మహా గజముఖాసురుణ్ణి. నిన్ను చంపవచ్చాను. చంపితీరుతాను’ అంటూ హూంకరించాడు. వినాయకుడు ఆ మాటలు వినిపించనట్లే అమాయకంగా చూస్తూ, ‘అబ్బాయ్! ముక్కలు నరుక్కుని చెరుకుగడ తినాలనుంది. నా గొడ్డలి కాస్త పదునుపెట్టి ఇస్తావంటే నీకు కుడుములు పెడతాను’ అంటూ వాటంగా చేతిలోని పరశువును అతడికేసి విసిరాడు. దెబ్బకు కాళ్లుతెగి, గజముఖాసురుడు పర్వతంలా కుప్పకూలిపోయాడు. ‘మహాప్రభో! నేను విఘ్నాన్ని. వజ్రదంతుడైన మూషికాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల నేను ఈ రూపంలో నీ ముందుకొచ్చాను. తగిన శాస్తి జరిగింది. రక్షించు’ అంటూ గావుకేకలు పెట్టాడు. ‘నేను విఘ్ననాశకుణ్ణి. నిన్ను తుత్తునియలు చేయక తప్పదు. నీ తునకలు నన్ను, నిన్ను ఏమార్చిన వాళ్లనే పట్టి పీడిస్తాయి’ అంటూ విఘ్నాన్ని సూక్ష్మతి సూక్ష్మ ఖండాలుగా చెండాడాడు వినాయకుడు. -
9 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు
సాక్షి, ఖైరతాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతిని తొమ్మిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నట్లు అందుకు సంబంధించిన నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది తక్కువ ఎత్తులోనే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో గణేశుడు దర్శనమివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. విగ్రహాన్ని 9 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేస్తున్నామని సుదర్శన్ చెప్పారు. పశ్చిమబెంగాల్లోని గంగానది నుంచి బంకమట్టిని తెప్పించి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది అడుగుల విగ్రహానికి ఆరు చేతులు, లక్ష్మీ, సరస్వతీ సమేతంగా ఏర్పాటుచేస్తున్నామని సుదర్శన్ వెల్లడించారు. కుడివైపు చేతిలో ఆయుర్వేద గ్రంథం, శంఖం, అభయహస్తం, ఎడమవైపు వనమూళికలు, అమృతభాండం, లడ్డూ, తొండంపై కలశం ఉంటుందని స్పష్టంచేశారు. -
ప్చ్... దేవుడికే ‘పరీక్ష’ పెట్టాలనుకున్నారు
సాక్షి, పట్నా : ఇలాంటి పొరపాట్లు దొర్లటం సహజమే కావొచ్చు. కానీ, విద్యావ్యవస్థపై విమర్శలు వినిపించే బిహార్‌లోనే ఈ ఘటన చోటు చేసుకోవటమే ఇక్కడ విశేషం. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో హల్ టికెట్లో విద్యార్థికి బదులు.. వినాయకుడి ఫోటో.. కింద సంతకం కూడా గణేశ్ అని ఉంది. దీంతో దేవుడే వచ్చి పరీక్ష రాస్తాడా? అని సదరు విద్యార్థి ప్రశ్నిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్లితే... దర్భాంగలోని లలిత్ నారాయణ్ మిథిల యూనివర్సిటీలో కృష్ణ కుమార్ రాయ్ అనే విద్యార్థి బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అక్టోబర్ 9 నుంచి పరీక్షలు మొదలు అవుతుండగా.. బుధవారం యూనివర్సిటీ అధికారులు అతనికి హాల్ టికెట్ జారీ చేశారు. అది చూసి అతని నోట మాట పడిపోయింది. వినాయకుడి ఫోటో, కింద గణేషుడి సంతకం.. పైగా ఆ విద్యార్థి అడ్రస్ కూడా తప్పుగా రాసి ఉంది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం నేను చెప్పేది కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు దేవుడే వచ్చి పరీక్ష రాస్తాడా? అంటూ కృష్ణ ప్రశ్నిస్తున్నాడు. ఇక ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే.. హాల్ టికెట్లు ముంద్రించేందుకు బయట ప్రైవేట్ ప్రింటింగ్ మిషన్ల సాయం తీసుకుంటామని, బహుశా అక్కడ తప్పు దొర్లి ఉండొచ్చని.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని చెబుతున్నారు. కాగా, ఇదే యేడాది మొదట్లో బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష సందర్భంగా ఓ అమ్మాయి హల్ టికెట్‌పై భోజ్‌పురి నటి అంతరా బిశ్వాస్(మోనాలిసా) టాప్ లెస్ ఫోటోను ముద్రించిన విషయం తెలిసిందే. -
అమెజాన్ మరో పైత్యం
చండీఘడ్: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా.. తప్పులు మీద తప్పు లు చేస్తూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదిర్శిస్తోంది. తాజాగా ఏకంగా వినాయకుడి బొమ్మలున్న స్కేట్ బోర్డులను విక్రయానికి పెట్టింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ తీరుకు నిరసనగా చండీగఢ్‌కు చెందిన న్యాయవాది అజయ్ జగ్గా స్పందించారు. స్కేట్ బోర్డులపై గణపతి బొమ్మలను ముద్రించడంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే అమెజాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ నుంచి వాటిని తొలగించాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 295 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. భారతీయుల మనోభావాలనుదెబ్బతీసిన అమెజాన్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాగా ఇటీవల అమెజాన్ భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తూ వెబ్ సైట్ లో వస్తువులను విక్రయానికి పెట్టింది. జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్మ్యాట్లలు ఆ తర్వాత మహాత్మాగాంధీ ఫొటో ముద్రించిన చెప్పులను వెబ్సైట్లో పెట్టింది. దీనిపై కేంద్ర విదేశామంత్రి సుష్మా స్వరాజ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. -
వివాదాస్పద ట్వీట్లపై విచారణ ఎదుర్కోనున్న వర్మ
ముంబై: ట్విట్టర్లో వినాయకుడిని ఎగతాళి చేస్తూ కామెంట్ చేసిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు. ప్రజల మత విశ్వాసాలను అవమానిస్తూ, వారిని రెచ్చగొట్టేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఐటీ చట్టంలోని 66(ఏ) సెక్షన్, ఐపీసీలోని 295(ఏ), 505 సెక్షన్లకు అనుగుణంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముంబైలోని అంధేరీ కోర్టు అంగీకరించింది. జూలై 19 లోగా కోర్టు ముందు హాజరుకావడం కానీ, తన న్యాయవాది ద్వారా స్పందించడం కానీ చేయాలని ఆదేశించింది. గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా వినాయకుడిని ఎగతాళి చేస్తూ వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. -
అల్లం వినాయకుడు
దోమకొండ: నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన గృహిణి అందె లలిత శనివారం అల్లం కొనుగోలు చేయగా, వినాయకుడి ఆకారంలో కనిపించింది. పూర్తిగా వినాయకుడి రూపం పోలి ఉండగా, దానిని అలాగే ఉంచారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు వినాయకుడి రూపంలో ఉన్న అల్లాన్ని చూసేందుకు తరలివచ్చారు. గణపతి రూపం కావడంతో దండాలు పెట్టారు. -
వీడ్కోలు నీకిదే...
-
ముక్కుతో వినాయకుని బొమ్మ గీసేశాడు
హైదరాబాద్: నగరంలోని వీఎన్ఆర్ సద్గురు పాఠశాలలో జరిగిన వినాయక చిత్రమాలికలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ముక్కుతో గణనాధుడి బొమ్మగీసి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పాఠశాలకు చెందిన మాస్టర్ రాంబాబు బ్లాక్ పేయింట్ను ముక్కుసాయంతో వాడుతూ అద్భుతమైన గణనాధుని విగ్రాహాన్ని ఆవిష్కరించారు. -
వినాయకుడికి గవర్నర్ తొలి పూజలు
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తొలిపూజలు జరిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఖైరతాబాద్‌లోని భారీ గణ నాధుడి వద్ద గవర్నర్ ప్రత్యేక తొలి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో గణేశుడికి వారు కొత్త వస్త్రాలు కూడా సమర్పించారు. -
వినాయకుడికి గవర్నర్ తొలి పూజలు
-
ఇండోనేషియా నోటుపై గణపతి బొమ్మ
అమలాపురం :మనం తొలిపూజ చేసే గణపతికి మనదేశంలోనే కాక ఇండోనేషియాలోనూ గణనీయమైన ‘గుర్తింపు’ ఉంది. ఆ దేశం విడుదల చేసిన 20 వేల రూపయా నోటుపై ఒకవైపు గణపతి బొమ్మను, ఆదేశ స్వాతంత్య్ర పోరాట యోధుడు, అక్కడి విద్యావ్యవస్థకు పునాది వేసిన కిహజర్ దేవాంతరాని బొమ్మను, మరోవైపు విద్యావ్యవస్థను ముద్రించింది. ఆ దేశంలో హిందువులు కేవలం 1.7 శాతం మాత్రమే ఉండగా ఆ దేశంలో అంతర్భాగమైన బాలి ద్వీపంలో మాత్రం సుమారు 84 శాతం హిందువులు ఉన్నారు. ఆ నోటుని అమలాపురం ఎస్బీఐ బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ఇవటూరి రవిసుబ్రహ్మణ్యం సేకరించారు. -
నిమజ్జనం ఎందుకు జరపాలి....
-
రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదు
వినాయకుడిపై ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసి.. ప్రజల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీశారంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ముంబైలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణను అంధేరి మేజిస్ట్రేట్ ఈనెల 30వ తేదీకి పోస్ట్ చేశారు. ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ, కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మీడియా సెల్ అధ్యక్షుడు అయిన వివేక్ శెట్టి కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వినాయకుడు తన భక్తుల కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నాడని రాంగోపాల్ వర్మ ప్రశ్నించడమే కాక.. ఆయన శారీరక విషయాలపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి హిందువుల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని అందులో తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 295ఎ, 504, 505లను వర్మ ఉల్లంఘించినట్లయిందన్నారు.