breaking news
Ganesh Navaratri celebrations
-
వినాయకుడికి ఆధార్ కార్డు.. మీ ఆలోచనకు సలాం గురూ!
రాంచీ: ప్రజల జీవితంలో ఆధార్ కార్డు ఒక భాగమైపోయింది. ఏ పని చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే.. ఒక్క మనుషులకేనా? దేవుళ్లకు కూడా ఆధార్ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు.. అందుకు వినాయక చవితి ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. గణేషుడి పేరుపై ఆధార్ కార్డు సృష్టించేశారు. ఆధార్ నమూనాతో భారీ ఎత్తున ఆధార్ కార్డు మండపం వేశారు. ఆధార్ కార్డ్ థీమ్‌తో వేసిన ఈ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడికి వచ్చి పోయే భక్తులు ఆసక్తితో ఆధార్ కార్డులోని వివరాలను చదువుతూ, సెల్ఫీలు దిగుతూ ముచ్చట పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రకారం.. వినాయకుడి అడ్రస్ కైలాసంగా పేర్కొన్నారు. ఫోటో స్థానంలోనే గణేషుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. అది గూగుల్ లింక్‌కు వెళ్తుంది. అందులో వినాయకుడికి సంబంధించిన ఫోటోలు ప్రత్యక్షమవుతాయి. ఆ వినూత్న ఆధార్‌పై శ్రీ గణేశ్ S/o మహాదేవ్, కైలాస్ పర్వత శిఖరం, మానస సరోవరం సరస్సు దగ్గర, పిన్‌కోడ్ 000001 అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ 01/01/600CEగా పేర్కొన్నారు. Jharkhand | A Ganesh Pandal in Jamshedpur has been made in the form of an Aadhar card which identifies the address of Lord Ganesha in Kailash & his date of birth during the 6th century #GaneshChaturthi pic.twitter.com/qupLStkut6 — ANI (@ANI) September 1, 2022 ఇదీ చదవండి: విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం -
జై బోలో గణేశ్ మహారాజ్‌కి...జై!
పండగ రోజు షూటింగ్‌లకు కాస్త గ్యాప్ ఇచ్చి వినాయక చవితి సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు బాలీవుడ్ సినీ తారలు. ఇంట్లో పండగ చేసుకుని ఇరుగింటికి పొరుగింటికి కూడా వెళ్లారు. ఈ తొమ్మిది రోజులూ బాలీవుడ్లో ఇలా సందడి సందడిగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ అయితే ఘనంగా పూజా కార్యకమాలు ఏర్పాటు చేసి, ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు. కత్రినా కైఫ్, ఆమె చెల్లి ఇసబెల్లా కైఫ్, సంజయ్‌దత్, ఆయన సతీమణి మాన్యతా దత్, సోహా అలీఖాన్, సల్మాన్ ప్రేయసి లూలియా వంటూర్, షారుక్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్.. ఇలా చాలా మంది స్టార్స్ అర్పితాఖాన్ అండ్ ఆయుష్ శర్మల ఇంటి వినాయకుడ్ని సందర్శించారు. ఈ ప్రముఖులు కొన్ని కెమెరా కళ్లకు చిక్కారు. ఇక ఇక్కడే ఉన్న ఫొటోలో చూశారుగా గణేశ్ మహరాజ్‌ని మాధురీ దీక్షిత్ ఎంత భక్తిగా ప్రార్థిస్తున్నారో. ప్రతి ఏడాదిలానే శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలసి స్వయంగా మార్కెట్‌కి వెళ్లి వినాయకుడ్ని కొని తెచ్చారు. నిమజ్జనం రోజున ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు. క్రేజీ స్టార్స్ తమన్నా, శ్రద్ధాకపూర్‌లను చూస్తున్నారా? నవ్వులు చిందిస్తూ పూజ చేస్తున్నారు. మరో బ్యూటీ సోనమ్ కపూర్‌కి పెళ్లయ్యాక వచ్చిన తొలి వినాయక చవితి ఇది. ఆమె కూడా ఘనంగా జరుపుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ గాళ్ కంగనా రనౌత్ సెలబ్రేషన్స్‌లో మాత్రం వెనక్కు తగ్గుతారా? తన సోదరి రంగోలి రనౌత్ కొడుకుతో కలిసి హ్యాపీ వినాయక చవితి చెప్పారు. అలాగే సెన్సేషనల్ స్టార్ సన్నీ లియోన్ ఇంట్లో కూడా పండగ వాతావరణం వచ్చింది. ఇక్కడున్న ఫొటోలో ఆమె భర్త డానియల్, సన్నీల దత్త పుత్రిక నిషాలను చూడొచ్చు. ఇదే రేంజ్లో షారుక్‌ఖాన్, అనుష్కా శర్మ.. ఇలా మరెందరో బాలీవుడ్ తారలు పండగని ఘనంగా జరుపుకున్నారు. బచ్చన్ ఫ్యామిలీని మరచిపోతే ఎలా? ఆ ఇంటి పండగ సందడి కూడా బ్రహ్మాండంగా వినిపించిందని బాలీవుడ్ టాక్. సోదరి తనయుడితో కంగనా రనౌత్; భర్త రాజ్ కుంద్రా, తనయుడు వియాన్‌తో శిల్పా శ్రద్ధాకపూర్ దత్త పుత్రిక, భర్తతో సన్నీ కత్రినా, ఇసబెల్లా, ; చెల్లి ఇంటి దారిలో సల్మాన్... -
కొలువుదీరనున్న గణపయ్య
ఎదులాపురం (ఆదిలాబాద్): గణేశ్ నవరాత్రులకు జిల్లా ముస్తాబైంది. గురువారం వినాయక చవితిని పురస్కరించుకోని జిల్లావ్యాప్తంగా గణనాథులు కొలువుదీరనున్నారు. జిల్లాలో మొత్తం 826 వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గణేశ్ మండలి కమిటీల ఆధ్వర్యంలో మండపాలను సిద్ధం చేశారు. మండపాల అలంకరించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వివిధ ఆకృతుల్లో చేపట్టిన నిర్మాణాలతో మండపాలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచే భారీ విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో మండపాలకు తరలించారు. గురువారం చవితి పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. పలువురు ఒక రోజు ముందుగానే వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ కనిపించారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం పెరిగిన నేపథ్యంలో చాలా మంది మట్టి గణపతులను ప్రతిష్టించేందుకు ఉత్సాహం చూపించడం విశేషం. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో జై శ్రీరాం గణేశ్ మండలి ఆధ్వర్యంలో వినాయక చౌక్ సమీపంలో 51 అడుగుల వినాయక ప్రతిమను, కుమార్ జనతా మండల ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహంతో పాటు 25 ఫీట్ల శ్రీకృష్ణ విశ్వరూప ప్రతిమను (గీతాబోధన చేస్తున్నట్లుండే) ఏర్పాటు చేశారు. రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కిసాన్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో కర్ర గణపతిని ప్రతిష్టిస్తున్నారు. పట్టణంలోని పలు మండళ్లలో వినూత్నంగా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు.. జిల్లావ్యాప్తంగా 826 గణనాథులు కొలువుదీ రుతుండగా, జిల్లా కేంద్రం పరిధిలో 453 మండపాలు ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో మండపానికి ఒకరిని నియమిస్తూ, ప్రతి 10 గణేశ్ మండళ్లను ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. క్లస్టర్‌కు ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును నియమించి రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 58 ప్రధాన మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో 32, ఇచ్చోడలో 9, ఉట్నూర్‌లో 17 మండపాల వద్ద ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్ని గణేశ్ మండళ్ల సభ్యులతో సమావేశాలు నిర్వహించి, వారి వివరాలను సేకరించారు. ఒక్కో గణేశ్ మండలిలో ఇద్దరు వ్యక్తులు (కార్య నిర్వాహకులకు) రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చూసుకోవాలని సూచించారు. -
గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం
వేలంలో రూ. 51,786కు కొనుగోలు వరంగల్: గణపతి నవరాత్రి ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వరంగల్ డాక్టర్స్ కాలనీ-2లో వరదా వేంకటేశ్వరస్వామి ఆలయంలో నెలకొల్పిన గణేశుడి చేతిలోని లడ్డూను ఓ ముస్లిం వ్యాపారి కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. ఆదివారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా, వ్యాపారి షేక్ రియాజ్ రూ. 51.786కు పాటపాడి కొనుగోలు చేశారు. గతేడాది తాను వినాయకుడి చేతిలోని లడ్డూను కొనుగోలు చేసినట్లు కల వచ్చిందని, అందుకే ఈ సారి వేలంపాటలో పాల్గొని లడ్డూను కొనుగోలు చేసినట్లు చెప్పారు -
నిమర్జనం జాగ్రత్త
జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జనం భక్తి పారవశ్యంతో ఆదిదేవున్ని కొలుస్తున్నారు. మరికొన్నిచోట్ల మాలధారణలు, కంకణధారణలు స్వీకరించి తమదైన రీతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల పర్యావరణ పరిరక్షణ కు మట్టి వినాయకులను ప్రతిష్టించి ప్రత్యేకత చాటుకుంటున్నారు. మంటపాల్లో నిర్వాహకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఉత్సవాలతో పాటే ప్రమాదాలూ పొంచి ఉన్నాయనే విషయాన్ని మరవొద్దు. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న నవరాత్రులను అంతే ఆనందంతో ముగించుకోవాల్సిన అవసరం ఉంది. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అశుభ ఘడియలు చోటు చేసుకోకుండా కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సంబురాలు విజయవంతం చేయొచ్చు. - కరీంనగర్ క్రైం → నిమజ్జనోత్సవం విజయవంతం చేద్దాం.. → కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమం → మండళ్ల నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల చోదకులు ఇవి పాటించాలి నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిమలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వస్తుంటారు. కాబట్టి ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు సూచనలివ్వాలి. ►అనుభవజ్ఞులైన డ్రైవర్లనే ఎంచుకోవాలి. ►డ్రైవర్‌కు ముందుగానే పోలీసులు, ఉత్సవ సమితి వారు సూచించిన సూచనలు, సలహాలను ఇవ్వాలి. ►డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాలి. ►మద్యం, మత్తు పానీయాలు, పదార్థాలకు దూరంగా ఉండాలి. ►ముందు, వెనుక, పక్కభాగాలను పరిశీలిస్తూ డ్రైవింగ్ చేయాలి. ►డ్రైవర్ పక్కన ఎవరినీ కూర్చోనివ్వద్దు. అలాగే వాహనం ముందు భాగంలో ఎవరినీ కూర్చోనివ్వకూడదు. ►రోడ్లపై ఉండే గతుకులు, గుంతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ►విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వినాయక ప్రతిమకు తగిలే అవకాశం ఉంటే అవి వెళ్లే వరకు పూర్తి శ్రద్ధతో వాహనం నడిపి వాటిని తప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకాకూడదు. ►ట్రాక్టర్ పైన ప్రతిమ వద్ద ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. ►డ్రైవర్‌ను సదరు నిర్వాహకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. కుటుంబీకులూ తమ వంతుగా... ►శోభాయాత్ర, నిమజ్జన సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. ►నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపించకుండా, తెలిసిన వారితో గానీ, కుటుంబ సభ్యుల్లోని వారితో గానీ వెళ్లేలా చూసుకోవాలి. ►ఎలాంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా చూసుకోవాలి. మత్తు పానీయాలు, పదార్థాలకు లోనుకాకుండా ఆదేశాలు ఇవ్వాలి. ►క్రమశిక్షణ, శాంతియుతంగా ఉండాలని ఆదేశించాలి. ►శోభాయాత్ర తిలికించేందుకు చాలా మట్టుకు ప్రజలు డాబాల పైకి ఎక్కి తిలకిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ప్రహారి ఉన్న డాబాలపైకి ఎక్కి తిలకించాలి. అలాగే సమీపంలో విద్యుత్ తీగలు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. సెట్టింగ్‌ల విషయంలో... వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర భక్తి ప్రపత్తుల మధ్య జరుపుకోవాలి. ఇందులో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడం మేలు. ఒక బండి తర్వాత ఇంకో బండి వరుస క్రమంలో వెళ్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. తిలకించే భక్తులకూ సౌకర్యంగా ఉంటుంది. ►శోభాయాత్రలో పూర్తిగా సంయమనం పాటించాలి. ►ఎలాంటి ఉద్వేగాలకు పోకూడదు. ►కేటాయించిన నెంబర్ల ప్రకారమే క్రమపద్ధతిలో వెళ్లాలి. ►ఉత్సవ సమితి వారు, పోలీసులు సూచించినవిధి విధానాలు పాటించాలి. ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాలను భారీ సెట్టింగులతో వేసి వచ్చే భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని నింపేందుకు చాలా చోట్ల ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటికే చేశారు. మరికొన్ని చోట్ల సెట్టింగులు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే.. వేసే సెట్టింగుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. ►కరెంటు వైర్ల కింద నుంచి సెట్టింగులు ఉండ కుండా జాగ్రత్త పడాలి. ►లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. తెగిపోవడం, జాయింట్లు వేయడం వంటివి లేకుండా చూసుకోవాలి. ►సెట్టింగుల సమీపంలో బాణసంచాలు పేల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ►అగ్ని ప్రమాదాలు సంభవించే వాటిని సమీ పంలో ఉంచకుండా చూసుకోవాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాటిని ఆర్పేందుకు వీలుగా అవసరమైన నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచాలి. ►ఆది దేవున్ని దర్శించుకునే భక్తులకు ప్రతిమ వద్దకు వెళ్లేందుకు వీలుగా పకడ్బందీగా మెట్లు, స్టేజీలను ఏర్పాటు చేయాలి. ►దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఎలాంటి తోపులాటలు జరుగకుండా ఒకరి తర్వాత ఒకరు దర్శించుకు నేలా భారీ కేడ్లను ఏర్పాటు చేయాలి. ►వర్షపు నీరు లోపలికి రాకుండా పైభాగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, మండపాల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ►రాకపోకలు సాగించే ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిమజ్జనం సమయంలో... ►ప్రతిమలను ప్రవహించే నదులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, లోతైన వాటిల్లో నిమజ్జనం చేస్తారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ►నిమజ్జన సమయంలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే క్రెయిన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు. ►సూచనలు, విధివిధానాలు తప్పక పాటించాలి. ►పోలీసులు, నిమజ్జనం చేసే సదరు నిర్వాహకుల హెచ్చరికలు కాదని చెరువులు, నదులు, కుంటలు, ప్రాజెక్టుల నీటిలోకి వెళ్లేందుకు సాహసించకూడదు. ►నీటి లోపలికి ఎవరూ వెళ్లకూడదు. అందులోనూ ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలోకి దిగకూడదు. కరెంటు వైర్ల వద్ద జాగ్రత్త.. ►నిమజ్జన శోభాయాత్ర సమయంలో చాలా సందర్భాల్లో కరెంటు తీగలతో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి వాటి పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ►కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను ముందుగానే విద్యుత్ శాఖ వారు సరిచేయాలి. ►శోభాయాత్ర సమయంలో లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోవడం, జాయింట్లు ఉన్న వైర్లను వినియోగించ కూడదు. ►జనరేటర్‌ను ప్రతిమ ఉన్న వాహనంలో ఉంచకుండా, దాని వెనుక భాగంలో ఒక వాహనంలో గానీ, ట్రాలీలో గానీ ఉండేలా చూసుకోవాలి. ముందు వాహనం కదిలిన సమయంలో వెనువెంటనే జనరేటర్ కదిలేలా అప్రమత్తంగా ఉండాలి. ►విద్యుత్ తీగలు ప్రతిమకు తగిలే అవకాశం ఉందనిపిస్తే వెంటనే వాటిని పైకిలేపేందుకు ప్రత్యేక కర్రలు ఏర్పాటు చేసుకోవాలి. వైర్లు దాటే వరకు అప్రమత్తంగా ఉండాలి. ►శోభాయాత్రలో బాణసంచాలు, తదితర పేలుడు పదార్థాలు ఉపయోగించరాదు. ►అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటిని నివారించేందుకు ప్రతిమ వెంట వాహనంలో అవసరమైనంత మేర నీళ్లు, ఇసుకను బకెట్లలో ఉంచుకోవాలి. భక్తి పారవశ్యం చాటుదాం.. ►నిత్యం ఎంతటి భక్తితో ఆదిదేవున్ని కొలిచామో అదే మాదిరిగా నిమజ్జన శోభాయాత్రలోనూ ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరున్ని కొలవాలి. ►భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ఇష్టారీతిన పారే యకుండా చేతికి అందివ్వాలి. ►భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తిస్థాయిలో సామరస్యపూర్వక వాతావరణం కలిగేలా చూడాలి. ►నిర్వాహకులు శాంతి, సామరస్యపూర్వకంగా ఉండాలి. ►ప్రధానంగా ఊరేగింపు సమయంలో ఆధ్యాత్మిక చింతన ప్రజ్వరిల్లేలా దేశ సంస్కతి, సంప్రదాయాలను వెల్లివిరిసే భక్తి పాటలు, నృత్యాలు, కోలాటాలు తదితర వాటిని చేసుకుంటూ వెళ్లాలి. ►తిలకించేందుకు వచ్చే చిన్నారులు, మహిళలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. ►మండపాల నిర్వాహకులు తమతో వచ్చే సభ్యులను తీసుకెళ్లడంతో పాటు వారిని తిరిగి ఇంటికే చేర్చే వరకు బాధ్యతగా వ్యవహరించాలి. ►ఏదైనా చిన్న సంఘటన జరిగితే దానిని సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చూడాలి. సమాచారం ఇవ్వండి..