గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం | Ganapathi Brownies win Muslim | Sakshi
Sakshi News home page

గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం

Sep 8 2014 12:46 AM | Updated on Sep 2 2017 1:01 PM

గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం

గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం

గణపతి నవరాత్రి ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

వేలంలో రూ. 51,786కు కొనుగోలు

వరంగల్: గణపతి నవరాత్రి ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వరంగల్ డాక్టర్స్ కాలనీ-2లో వరదా వేంకటేశ్వరస్వామి ఆలయంలో నెలకొల్పిన గణేశుడి చేతిలోని లడ్డూను ఓ ముస్లిం వ్యాపారి కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది.

ఆదివారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా, వ్యాపారి షేక్ రియాజ్ రూ. 51.786కు పాటపాడి కొనుగోలు చేశారు. గతేడాది తాను వినాయకుడి చేతిలోని లడ్డూను కొనుగోలు చేసినట్లు కల వచ్చిందని, అందుకే ఈ సారి వేలంపాటలో పాల్గొని లడ్డూను కొనుగోలు చేసినట్లు చెప్పారు
 

Advertisement
 
Advertisement
Advertisement